Allu Arjun : ఆ విషయంలో ప్రభాస్ ను మించి పోయిన అల్లు అర్జున్
NQ Staff - March 9, 2023 / 10:30 PM IST

Allu Arjun : పారితోషికం విషయంలో బాలీవుడ్ హీరోలను ఎప్పుడో మన తెలుగు హీరోలు క్రాస్ చేశారు అనే విషయం తెల్సిందే. హీరోగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ఒక్కొక్క సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడని ప్రచారం గత కొన్ని కాలం కొన్నాళ్లుగా జరుగుతుంది.
ప్రభాస్ కాకుండా మరి కొందరు సౌత్ హీరోలు కూడా 100 కోట్ల రూపాయల వారితోషికం అందుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోతున్న సినిమాకు ఏకంగా 120 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకు పోతున్నట్లుగా తెలుస్తోంది.

Allu Arjun Remuneration Increased Immensely After Pushpa Movie
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ స్థాయి అమాంతం పెరిగింది. అందుకే ఆయన సందీప్ రెడ్డి వంగా సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ ముందు ముందు 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.