ALLU ARJUN: నేను కోలుకుంటున్నాను, ఆందోళన చెంద‌నక్క‌ర్లేదు: అల్లు అర్జున్

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌రోనా బారిన ప‌డ‌గా, ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. కొద్ది రోజులుగా నన్ను క‌లిసిన వారంతా క‌రోనా టెస్ట్‌లు చేయించుకోవాలి. అభిమానులు ఎవ‌రు ఆందోళ‌న చెందొద్దు.నాకు మైల్డ్ సింప్ట‌మ్స్ మాత్ర‌మే ఉన్నాయి. అంద‌రు క్షేమంగా ఉండండి, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

బ‌న్నీకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన త‌ర్వాత అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌న్నీ ఆరోగ్యం గురించి ఆరాలు తీస్తూనే ఉన్నారు. అభిమానుల ప‌రిస్థితిని అర్ధం చేసుకున్నల్లు అర్జున్.. తాను చాలా బాగా కోలుకుంటున్నాను అని తెలిపారు. అంతేకాదు ఎవ‌రు నా ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదు అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బన్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Advertisement