Allu Arjun : బన్నీ-అరవింద్ మధ్య గొడవలు పెట్టిన దిల్ రాజు.. ఎంత కుట్ర చేశాడు..?
NQ Staff - February 16, 2023 / 01:00 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఆయన ఈ స్థాయికి ఎదగడం వెనక అల్లు అరవింద్ హస్తం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో మెగాస్టార్ గా ఎదిగేందుకు చిరంజీవికి అన్ని విధాలుగా అండగా ఉన్న అల్లు అరవింద్.. ఇప్పుడు అల్లు అర్జున్ ను కూడా సక్సెస్ చేయడంలో ముందున్నాడు.
ఇక బన్నీ కూడా తండ్రి సపోర్టుతో మాత్రమే కాకుండా తన సొంత ట్యాలెంట్ తో ఎదిగిపోయాడు. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే దీని తర్వాత డైరెక్టర్ పరశురాం డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు బన్నీ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది.
పరశురాం వల్ల..
అల్లు అరవింద్ కూడా నిర్మాతగా ఓకే అయ్యాడు. కానీ మధ్యలోకి దిల్ రాజు వచ్చి చేరాడు. గీతా గోవిందం-2 సినిమాను చేయాలంటూ పరశురాం మీద ఒత్తిడి పెంచుతున్నాడు. దాంతో చేసేది లేక పరశురాం కూడా బన్నీ సినిమా కంటే ముందే గీతా గోవిందం-2 ను తీయాలని భావిస్తున్నాడంట. ఈ విషయం తెలిసి అరవింద్ సీరియస్ అయ్యాడు.
పరశురాంతో సినిమా చేయొద్దని మెగా హీరోలకు కండీషన్ పెట్టాడంట. కానీ బన్నీ మాత్రం వినకుండా పరశురాంతో కచ్చితంగా సినిమా చేస్తానంటూ చెబుతున్నాడంట. దాంతో మొదటి సారి తండ్రి మాటకు ఎదురు చెబుతున్నాడు బన్నీ. ఇప్పుడు ఇదే విషయంపై బన్నీ-అరవింద్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. దిల్ రాజు వచ్చి ఇద్దరి నడుమ చిచ్చు పెట్టాడని అంటున్నారు అల్లు ఫ్యాన్స్.