Pushpa2 Movie : పుష్ఫ-2 షూటింగ్ కోసం విశాఖ చేరుకున్న బన్నీ.. ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్..!
NQ Staff - January 20, 2023 / 11:48 AM IST

Pushpa2 Movie : పుష్పరాజ్ మేనియా ఇంకా నడుస్తూనే ఉంది. పుష్ఫ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అంచనాలను మించి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో పెద్ద హిట్ అయింది. అంచనాలను మించి బన్నీకి రేంజ్‌ను తెచ్చి పెట్టింది. అంతే కాకుండా అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను తెచ్చింది.
మామూలు జనాల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప రాజ్ మేనియాను అనుకరించారంటే దాని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప-2 సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు జక్కన్న బాగానే ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే షూటింగ్ పనులను కూడా స్టార్ట్ చేసేశాడు.
తరలి వచ్చిన ఫ్యాన్స్..
అయితే తాజాగా పుష్ప-2 షూటింగ్ కోసం అల్లు అర్జున్ విశాఖకు చేరుకున్నాడు. ఇండిగో ఫ్లైట్ లో ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నాడు. ఇక విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆయన నోవాటల్‌కు చేరకున్నాడు. ఇక నోవాటల్ దగ్గర పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గుమి గూడారు.
బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ అంతా ఎగబడ్డారు. కాగా విశాఖ లోనే రేపటి నుంచి పది రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది పుష్ప-2 టీమ్. ఈ షూటింగ్ కోసం సుకుమార్ టీమ్ ఇప్పటికే అన్నీ రెడీ చేసింది. ఇక తాజాగా బన్నీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన గడ్డం కాస్త చిన్నగా కనిపిస్తోంది. ఇదే లుక్‌ను సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.