Allu Arjun : ‘పుష్ప’ రిలీజ్ డేట్ చెప్పేసిన బన్నీ..

https://thenewsqube.com/entertainment/allu-arjun-pushpa-release-day-announced.html
https://thenewsqube.com/entertainment/allu-arjun-pushpa-release-day-announced.html

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరి సినిమా ‘అల వైకుంఠపురములో..’ వచ్చి అప్పుడే ఏడాది దాటిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు బన్నీ ఈ రోజు (గురువారం) స్వీట్ న్యూస్ చెప్పేశాడు. ఆగస్టు 13న థియేటర్లలో కలుసుకుందాం అంటూ ‘పుష్ప’ విడుదల తేదీని ట్విట్టర్ లో వెల్లడించాడు.

భలే మంచి రోజు..

‘ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే’.. శుక్రవారం.. వీకెండ్.. ఆదివారం వరకు వరుసగా మూడు రోజులు సెలవులు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘పుష్ప’ ఫిల్మ్ రిలీజ్ కి భలే మంచి టైమ్ సెట్ చేశారనిపిస్తోంది. విడుదల రోజు ఎలాగూ ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. శనివారం రిలాక్స్ మూడ్ లో ఎంప్లాయ్స్ థియేటర్లకు పోటెత్తుతారు. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవాన స్టూడెంట్స్ కి ఎక్కడలేని స్వాతంత్ర్యం వస్తుంది. దీంతో కలెక్షన్ల ‘పుష్పా’భిషేకం ఖాయం.

Allu-arjun-pushpa-release-day-announced
Allu-arjun-pushpa-release-day-announced

ముచ్చటగా: Allu Arjun

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మెగా హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా వస్తున్న మూడో మూవీ ఇది. అంతకు ముందు ‘ఆర్య’ సిరీస్ లో రెండు సినిమాలు వచ్చి పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో హాట్ బ్యూటీ రష్మిక మందానా కథానాయిక. మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేబోయేది దేవిశ్రీ ప్రసాద్. అల్లు వారి పెద్దబ్బాయి కూడా ఇదే అంటున్నాడు. సుక్కు, డీస్పీతో హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని చెబుతున్నాడు.

Advertisement