AAA Cinemas : రెండు కోట్ల‌తో స‌రికొత్త థ్రిల్ అందించ‌బోతున్న ఏఏఏ.. పిల్లలు, పెద్ద‌లు ఫుల్ ఫిదా అవుతార‌ట‌..!

AAA Cinemas : టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌తో ర‌చ్చ చేస్తున్నారు. ఇప్ప‌టికే మహేష్‌ బాబు ఇప్పటికే ఏషియన్‌ సినిమాస్ సంస్థతో కలిసి ఏఎంబీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఇక మహేష్‌ బాబు దారిలోనే విజయ్‌ దేవరకొండ కూడా ఏవీడీ ని మహబూబ్ నగర్‌ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవ‌ల ఈ థియేట‌ర్‌లో పుష్ప‌క విమానం ప్ర‌ద‌ర్శించ‌గా విజ‌య్ ఫ్యామిలీ అంతా వీక్షించారు.

TheNewsQube-
Allu Arjun presenting AAA cinemas
Allu Arjun presenting AAA cinemas

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మ‌ల్టీ ప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవ‌ల మ‌ల్టీప్లెక్స్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన మల్టీప్లెక్స్ కి సంబంధించి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అల్లు అర్జున్. ఈ మల్టీప్లెక్స్ ని ఆయన ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌, నారాయణ్‌ దాస్‌ నారంగ్ నిర్మాతలు. వరల్డ్ క్లాస్‌ ఎక్విప్‌మెంట్‌తో, ప్రపంచ స్థాయి హంగులతో ఈ మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారట.

Allu Arjun presenting AAA cinemas
Allu Arjun presenting AAA cinemas

అల్లు అర్జున్‌ మరియు ఏషియన్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ మల్టీ ప్లెక్స్‌ ಅమీర్ పేట్‌ లో ఒక మంచి సెంటర్‌ లో నిర్మిస్తున్నారు. గతంలో సత్యం థియేటర్‌ ఉన్న చోట ఈ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ మల్టీ ప్లెక్స్‌ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

మాల్ కమ్ మల్టీ ఫ్లెక్స్ ను లగ్జరియస్ డిజైన్ తో తయారు చేస్తున్నారని తెలుస్తోంది. పిల్లలను, పెద్లలను ఎంటర్ టైన్ చేసేలా ఓ టెక్నాలజీ వండర్ ను ఈ మల్టీ ఫ్లెక్స్ లో ఏర్పాటు చేసే ప్రయత్నం స్టార్ట్ చేసారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, లార్జ్ డిజిటల్ స్క్రీన్ మీద బన్నీ విజువల్ వుంటంది. దాని ముందు నిల్చున్నవారు ఏ హైట్ లో వుంటే ఆ హైట్ లోకి ఆ విజువల్ మారిపోతుంది.

చిన్న పిల్లాడు వుంటే ఆ సైజ్ లోకి. పైగా ఆ డిజిటల్ స్క్రీన్ ముందు నిల్చున్నవారు ఎలా మూవ్ అయితే ఆ విజువల్ అలా మూవ్ అవుతుంది. ఎలా మాట్లాడితే అదే మాట్లాడుతుంది. ఇలాంటి టెక్నాలజీ వండర్ ను ఏర్పాటు చేయడానికి సంబంధిత కంపెనీతో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ ఒక్కదానికే రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.