Allu Arjun: రాబోవు రెండేళ్ల‌లో అల్లు అర్జున్ ఏయే సినిమాలు చేయ‌నున్నాడో తెలుసా?

Allu Arjun: టాలీవుడ్ టాప్ హీరోల‌లో అల్లు అర్జున్ ఒక‌రు. ఆయ‌న‌కు ఇప్పుడు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లోను బ‌న్నీకి వీరాభిమానులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. చిత్తూరు యాసలో ‘తగ్గేదే..లే’ అంటూ వేట కొడవలితో ఊర మాస్ గెటప్‌లో అల్లు అర్జున్ చెప్పి డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది.

Allu Arjun

నాలుక మడతపెట్టి ఎర్రచందనం దుంగల్ని పైకి ఎగరేసే సీన్.. ముఖానికి ముసుగు కట్టుకుని మరీ విలన్లను ఊచకోత కోసే సీన్లలో పుష్పరాజ్ ఉగ్రరూపం చూపించాడు. పిక్చరైజేషన్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ‘పుష్పరాజ్’ నెక్స్ట్ లెవల్ అనేట్టుగానే ఉంది. టీజ‌ర్‌తోనే సినిమాపై భారీ అంచ‌నాలు పెంచారు మేక‌ర్స్. అయితే పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్న మేక‌ర్స్ తొలి పార్ట్‌ని ఈ ఏడాది విడుద‌ల చేయ‌నున్నారు. రెండో పార్ట్ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Allu Arjun

పుష్ప త‌ర్వాత బ‌న్నీ చేయ‌బోవు ప్రాజెక్ట్‌పై అంద‌రిలో అనేక అనుమానాలు నెల‌కొన్నాయి. ఐకాన్ చేస్తాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన ఈ మ‌ధ్య దిల్ రాజు, శ్రీరామ్ వేణు చెప్పిన మాట‌ల‌తో అభిమానుల‌లో కొత్త ఆలోచ‌న‌లు పుట్టుకొచ్చాయి. ఐకాన్ ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంటుంద‌ని భావించారు. కాని దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు నిర్మాత బ‌న్నీ వాసు.త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అల్లు అర్జున్ రానున్న రోజులలో చేయ‌బోవు సినిమాల‌పై కూడా క్లారిటీ ఇచ్చారు.

Allu Arjun

పుష్ప చిత్రం ఫ‌స్ట్ పార్ట్ పూర్త‌య్యాక శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ సినిమా చేయ‌నున్నారు. దాని త‌ర్వాత పుష్ప 2 చేస్తారు. ఆ త‌ర్వాత మురుగ‌దాస్ సినిమా, బోయ‌పాటి సినిమాలుంటాయి. ఈ రెంటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళుతుంద‌నేది అప్ప‌టి ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని ఉంటాయి. ఆ త‌ర్వాతే కొర‌టాల శివ‌తో సినిమా ఉంటుంది’ అని క్లారిటీ ఇచ్చారు బన్నీ వాస్.

Allu Arjun

బ‌న్నీ ఐకాన్ ఉండ‌ద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో వాసు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అభిమానుల‌లోజోష్ పెరిగింది. అల్లు అర్జున్‌తో జీఏ2 బ్యానర్‌లో తప్పకుండా సినిమా ఉంటుంది. బన్నీతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న కథను చేయాలనుంది. రాబోవు రెండేళ్లలో అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుంది. ప్రస్తుతం అల్లు శిరీష్‌ కథానాయకుడిగా మా సంస్థ ఓ సినిమా చేస్తోంది అన్నీ బ‌న్నీ వాసు పేర్కొన్నారు.