Allu arjun : సుకుమారా మజాకా, పుష్ప సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ ట్విస్ట్ కి థియేటర్ దద్దరిల్లడం గ్యారెంటీ !

Allu arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పక్కా మాస్ ఫార్ములాతో తెరకెక్కిస్తున్న మూవీ ‘పుష్ప’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని చూస్తేనే తెలిసిపోతోంది అదెంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటదో. దానికి తగ్గట్లే క్లైమ్యాక్స్ కూడా ప్రేక్షకుల కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో వీళ్లిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్ ఖాయమనే టాక్ ఇప్పటినుంచే మొదలైంది.

ఎర్రచందనం..

‘పుష్ప’ ఫిల్మ్ ని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఫారెస్ట్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత మరో షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ నేరుగా విదేశాలకు వెళతుందట. దీన్నిబట్టి క్లైమ్యాక్స్ ఎలా ఊహించని మలుపు తిరుగుతుందో చెప్పొచ్చు. హీరో ఉన్నట్టుండి ఫారెస్ట్ నుంచి ఫారన్ కి ట్విస్ట్ ఇవ్వటం ఫ్యాన్స్ కి మస్తు థ్రిల్ ఇస్తుందని వివరిస్తున్నారు.

పది భాషల్లో: Allu arjun

‘పుష్ప’ సినిమా బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా నిలిచిపోనుందని అంటున్నారు. ఏకంగా పది భాషల్లో విడుదల చేస్తారంట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిస్తున్న ‘పుష్ప’లో రష్మిక మందానా అల్లు అర్జున్ తో హాట్ హాట్ గా ఆడిపాడనునంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీ సుకుమార్ మార్క్ తో, పక్కాగా ఆయన స్టైల్లోనే సాగుతుందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Allu-arjun-mind-blowing-twist-in-pushpa-movie-climax
Allu-arjun-mind-blowing-twist-in-pushpa-movie-climax

మూడోది..

సుకుమార్, అల్లు అర్జున్ గతంలో ఆర్య సిరీస్ లో రెండు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రూటు మార్చిన సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ఆర్య సిరీస్ కూడా భారీ సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలో పుష్పను కూడా సూపర్ డూపర్ హిట్ చేసేందుకు సుకుమార్.. క్లైమ్యాక్స్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇవ్వనున్నాడని చెబుతున్నారు. దీంతో ప్రేక్షకులు సుకుమారా మజాకా అనాల్సిందేనట.

Advertisement