Allu Arjun: త‌హ‌సిల్దార్ కార్యాల‌యంలో బ‌న్నీ సంద‌డి.. పోటెత్తిన అభిమానులు

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజులుగా పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా వరుణ్‌తేజ్‌, వెంక‌టేష్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ సెట్‌లో అల్లు అర్జున్‌ సందడి చేశారు. ప్రస్తుతం ‘ఎఫ్‌3’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. అనుకోకుండా అల్లు అర్జున్‌ సెట్లోకి అడుగుపెట్టి చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, రాజేంద్రప్రసాద్‌, సునీల్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడిలతో సరదాగా ముచ్చటించారు అల్లు అర్జున్‌.

ఇక తాజాగా శంకర్ పల్లిలో సందడి చేశారు. ఆయన అక్కడ ఆస్తి కొన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి అధికారులతో బ‌న్నీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తాసిల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్ కంపించడంతో సందడి నెలకొంది. అల్లు అర్జున జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ కొరకు శంకర్ పల్లి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు.

రిజిస్ట్రేషన్ అనంతరం తాసిల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు. ఆయన అక్కడికి వచ్చారని తెలుసుకున్న అభిమానులు భారీగా గుమిగూడారు. అల్లు అర్జున్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. తాసిల్దార్ కార్యాలయం అధికారులు సైతం బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇటీవల తారక్ కూడా గోపాలపురంలో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.