Allu arjun : అల్లు అర్జున్ – కొరటాల శివ ల కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియన్ సినిమా ని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సస్ గా నిలవడం తో పాటు కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచే సినిమాని ఇవ్వాలని కొరటాల శివ కథ రెడీ చేస్తున్నారట. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నట్టు సమాచారం. స్టూడెంట్ లీడర్ గా, రాజకీయ నాయకుడి అల్లు అర్జున్ ని చూపించే విధంగా కొరటాల శివ కథ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ప్రక్టిస్తూ ఒక ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియన్ సినిమాగా నాలుగు భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని తాజా సమాచారం. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 13 న రిలీజ్ కాబోతోంది.
Allu arjun : అల్లు అర్జున్ – కొరటాల శివ ల పాన్ ఇండియన్ సినిమా 2022 సమ్మర్ కి టార్గెట్ ఫిక్స్..?
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు షెడ్యూల్స్ ప్లాన్స్ చేస్తున్నారట దర్శక, నిర్మాతలు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ఆగస్టు 13 న రిలీజ్ చేయబోతున్నారు. పుష్ప కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ – కొరటాల శివ ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నాడట. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం 2022 సమ్మర్ కి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియన్ సినిమాలతో రాబోతున్నాడు అల్లు అర్జున్.