Allu Arjun: భార్య‌, పిల్ల‌ల‌తో కేబుల్ బ్రిడ్జిపై ప్ర‌త్య‌క్షం అయిన బ‌న్నీ.. ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. సినిమాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీకి కొంత స‌మ‌యం కేటాయిస్తూ ఉంటాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న ఫ్యామిలీతో ఆనంద‌క్ష‌ణాలు గ‌డిపాడు. పిల్ల‌ల‌తో బ‌న్నీ చేసిన సంద‌డికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్నేహా రెడ్డి నిత్యం సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కావ‌ల‌సిన ఆనందాన్ని క‌లిగిస్తుంది.

 

బ‌న్నీ ప్రస్తుతం పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గ‌త కొద్ది రోజులుగా చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుండ‌గా, త‌న స‌మ‌యాన్ని ఎక్కువ‌గా షూటింగ్‌కే కేటాయించారు.అయితే రెండు రోజుల నుండి భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ఇంటికి ప‌రిమిత‌మైన బ‌న్నీ సాయంత్రం స‌మ‌యంలో త‌న ఫ్యామిలీతో క‌లిసి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. ఈ క్ర‌మంలో బన్నీ తన కారులో స్నేహారెడ్డి, అర్హ, అయాన్‌లను తీసుకుని కెబుల్ బ్రిడ్జ్ వైపు చక్కర్లు కొట్టేశారు.

స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఎక్కువగా బన్నీ కనిపించకపోయినా.. అర్హ, అయాన్‌లు మాత్రం కనిపిస్తున్నారు. బ‌న్నీ ఓ ఫ్రేంలో మాస్క్‌తో సీరియ‌స్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారు. అర్హ‌, అయాన్‌లు కేబుల్ బ్రిడ్జి అందాల‌ను చూస్తూ మురిసిపోయారు.

 

ఇక బ‌న్నీ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప” చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారిగా గిరిజన యువతి పాత్రను పోషిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు.