Allu Arjun : హోస్ట్ గా మారుతున్న బన్నీ.. భారీ ప్లాన్ చేస్తున్న ఆహా టీమ్..?

NQ Staff - March 16, 2023 / 09:55 AM IST

Allu Arjun : హోస్ట్ గా మారుతున్న బన్నీ.. భారీ ప్లాన్ చేస్తున్న ఆహా టీమ్..?

Allu Arjun : ఈ నడుమ హీరోలు కూడా వరుసగా హోస్ట్ లుగా మారి ప్రోగ్రామ్ లు చేస్తున్నారు. ఎందుకంటే బుల్లితెర, ఓటీటీ ప్రోగ్రామ్ లకు కూడా బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో స్టార్ హీరోలతో ప్రోగ్రామ్ లు చేయిస్తున్నాయి చాలా నిర్మాణ సంస్థలు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున లాంటి వారు హోస్ట్ లుగా చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా త్వరలోనే పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆహా ఓటీటీకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఇప్పటికే బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ వస్తోంది. ఇక తాజాగా మరో బిగ్ న్యూస్ చెప్పేసింది ఆహా.

బ్లాక్ బస్టర్ లుక్ తో…

 Allu Arjun Is Doing Big Program In Aha Soon

Allu Arjun Is Doing Big Program In Aha Soon

అల్లు అర్జున్ ఉన్న ఫొటోను పోస్టు చేసింది. దానిపై కమింగ్ సూన్ అని రాసి ఉంది. దానికి ఆహా ఇలా రాసుకొచ్చింది. ఇప్పటి వరకు మీరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మాస్ లుక్ లో, క్లాస్ లుక్ లో చూసి ఉంటారు. కానీ ఈ సారి బ్లాక్ బస్టర్ లుక్ లో మీ ముందుకు తీసుకురాబోతోంది ఆహా.. ‘ది బిగ్గెస్ట్’ అనౌన్స్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి! ఎనీ గెస్సెస్?’ అంటూ ట్వీట్ చేసింది.

దాన్ని బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ తో భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చూస్తుంటే అల్లు అర్జున్ తో కూడా ఓ ప్రోగ్రామ్ చేయించాలని భావిస్తోంది ఆహా టీమ్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూడాలి మరి బన్నీతో ఎలాంటి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తుందో.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us