Allu Arjun: మెగా అభిమాని కుటుంబానికి బ‌న్నీ సాయం.. ల‌వ్ యూ బ‌న్నీ అంటూ నెటిజ‌న్స్ ట్వీట్స్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కే కాక మెగా కుటుంబానికి చాలా ద‌గ్గ‌రైన నూర్‌ అహమ్మద్ ఎన్నో ఏళ్ళుగా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, మెగా వీరాభిమానిగా గుర్తింపు పొందారు. కొద్ది రోజుల క్రితం నూర్‌ అహమ్మద్‌ మృతి చెందాడు. ఆయ‌న మృతి ప‌ట్ల‌ మెగా కాంపౌండ్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Allu Arjun Help to Mega Fan Noor Bhai Family
Allu Arjun Help to Mega Fan Noor Bhai Family

నూర్‌ అహమ్మద్‌, గ్రేటర్‌ హైద్రాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షులుగా పనిచేశారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేశారు. నూర్‌ అహమ్మద్‌ మృతికి సంతాపంగా ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

Allu Arjun Help to Mega Fan Noor Bhai Family
Allu Arjun Help to Mega Fan Noor Bhai Family

తాజాగా నూర్ కుమార్తె వివాహ వేడుక‌కి సంబంధించిన ఇన్విటేష‌న్ కార్డ్ ఇచ్చేందుకు బ‌న్నీ ఇంటికి నూర్ కుమారుడు, కూతురు ఇచ్చారు.ఆయ‌న‌కు కార్డ్ ఇచ్చి పెళ్లికి రావాల‌ని ఆహ్వానించారు. అయితే వారికి ఆర్ధికంగా సాయం చేసిన బ‌న్నీ ఉద్యోగం కూడా ఇప్పిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారట‌. బ‌న్నీ స‌హృదయంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Allu Arjun Help to Mega Fan Noor Bhai Family
Allu Arjun Help to Mega Fan Noor Bhai Family

అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీతో మాల్దీవులకి వెళ్లారు. భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్‌, కూతురు ఆర్హలతో కలిసి అక్కడ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య అల్లు స్నేహా సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

Allu Arjun Help to Mega Fan Noor Bhai Family
Allu Arjun Help to Mega Fan Noor Bhai Family

ప్రస్తుతం బన్ని నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ షూటింగ్‌ చివరి దశకు చేరింది. ఈ క్రమంలో బన్నికి కాస్తా విరామ సమయం దొరికరడంతో ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో మాల్దీవులు పర్యటనకువెళ్లాడు.,

సుకుమార్ తెర‌కెక్కిస్తున్న‌ పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ చిత్రం కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.