Pushpa 2 : షాకిస్తున్న ‘పుష్ప-2’ బడ్జెట్, రెమ్యునరేషన్ లెక్కలు.!

NQ Staff - December 30, 2022 / 02:05 PM IST

Pushpa 2 : షాకిస్తున్న ‘పుష్ప-2’ బడ్జెట్, రెమ్యునరేషన్ లెక్కలు.!

Pushpa 2 : ఒకే ఒక్క సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయిపోయాడు. అదే ‘పుష్ప ది రైజ్’. దాంతో, ‘పుష్ప ది రూల్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

త్వరలో ‘పుష్ప ది రూల్’ సెట్స్ మీదకు వెళ్ళనుంది. సుకుమార్ దర్శకుడు, రష్మిక మండన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

వామ్మో.. అల్లు అర్జున్ స్టామినా ఈ స్థాయిలోనా.?

‘పుష్ప ది రూల్’ సినిమా బడ్జెట్ ఏకంగా 400 నుంచి 500 కోట్ల వరకూ పెరిగిందట. 100 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేశారట. అంతే కాదు, ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌కి రెమ్యునరేషన్‌గా 100 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో 30 శాతం లాభాల్లో వాటా కింది ఇస్తారట.

దర్శకుడు సుకుమార్ సైతం ఈ సినిమాతో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌కి 25 కోట్ల రెమ్యునరేషన్, లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. మిగిలిన 40 శాతం లాభాల్ని నిర్మితలు వుంచుకోనున్నారు.

అన్నీ కలుపుకుంటే అల్లు అర్జున్ 130 కోట్లు అందుకునే అవకాశం వుంది. అదే నిజమయితే, తెలుగు సినీ పరిశ్రమలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోగా అల్లు అర్జున్ రికార్డులకెక్కుతాడు. 2023 చివర్లో లేదా 2024 సంక్రాంతికి ‘పుష్ప ది రూల్’ ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us