Allu Arjun: బ‌న్నీ అభిమానులు ఐకాన్‌పై ఆశ‌లు వ‌దులుకోండి..!

Allu Arjun: చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తూ టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు బ‌న్నీకి తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు ప‌క్క రాష్ట్రాల‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్ర‌మంలో తాను పాన్ ఇండియా స్టార్ గా మారేందుకు కృషి చేస్తున్నాడు. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతుంది. ఇందులో పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో బ‌న్నీ క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న ర‌ష్మిక విలేజ్ గార్ల్‌గా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే బ‌న్నీ ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో విడుద‌ల కాగా, ఇది తెలుగు ఇండ‌స్ట్రీ రికార్డుల‌ని చెరిపేస్తుంది. రెండు పార్ట్‌లుగా పుష్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల అవుతుంది.

పుష్ప త‌ర్వాత బ‌న్నీ చేయ‌నున్న మూవీ ఐకాన్ – కనబడుటలేదు అని కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ సినిమాను
రెండేళ్ల క్రితం ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ప్ర‌క‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అనివార్య కార‌ణాల వ‌ల‌న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దీంతో బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో, పుష్ప చిత్రాలు చేసాడు. మ‌రోవైపు వేణు శ్రీరామ్ ..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌కీల్ సాబ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన వేణూ శ్రీరామ్ త్వ‌ర‌లోనే బ‌న్నీతో ఐకాన్ చేయ‌నున్న‌ట్టు అంద‌రు అనుకుంటున్నారు. కాని దిల్ రాజు,వేణు శ్రీరామ్ కామెంట్స్‌ని బ‌ట్టి చూస్తుంటే బ‌న్నీతో ఐకాన్ సినిమా ఉండ‌బోద‌ని అర్ధ‌మ‌వుతుంది.

ఇటీవల దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ తాము వెంటనే చేయబోయేది ‘ఐకాన్’ సినిమానే అని వెల్లడించారు. వేణు సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఐకాన్’ మీదే వర్క్ చేయబోతున్నట్లు చెప్పాడు. అయితే దర్శక నిర్మాతలిద్దరూ కూడా హీరో అల్లు అర్జున్ తో ఐకాన్ ఉంటుంద‌ని ఎక్క‌డా కూడా చెప్ప‌లేదు. దీంతో బ‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో ఐకాన్ ఉండ‌ద‌ని మ‌రో హీరోతో ఈ సినిమా చేయ‌నున్న‌ట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ . అయితే బ‌న్నీకి స్క్రిప్ట్ న‌చ్చ‌క ఐకాన్ సినిమా చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక ఐకాన్ చేయ‌డం లేద‌ని అంటున్నారు. చూడాలి దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో.