Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో దెయ్యాల హంగామా.. భ‌య‌ప‌డుతున్న నెటిజ‌న్స్

Allu Arjun అల్లు అర్జున్ ఇంట్లో దెయ్యాల హంగామా ఏంట‌ని అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజ‌మే. బన్నీ ఇంట్లో రెండు పిల్ల దెయ్యాలు స్టైలిష్‌గా రెడీ అయి అంద‌రిని వ‌ణికించాయ‌ట‌. ఈ విష‌యాన్ని చెప్పింది మ‌రెవ‌రో కాదు బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి. దెయ్యాల హ‌డావిడికి సంబంధించి వీడియో షేర్ చేస్తూ మ‌రీ ఈ విష‌యాన్ని చెప్పుకొచ్చింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే స్నేహా రెడ్డి నిత్యం త‌న పిల్ల‌ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆమె 4 మిలియ‌న్స్ ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. స్టార్ హీరో భార్య‌లు ఎవ‌ర‌కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేక‌పోగా, అరుదైన రికార్డ్ సాధించిన వ్య‌క్తిగా స్నేహా రెడ్డి నిలిచింది.

బ‌న్నీ పిల్ల‌లు తెల్లటి బట్టతో ముసుగు వేసుకొని ఆ ఇద్దరూ ఇల్లంతా తిరుగుతూ నానా హంగామా చేశారు. కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్‌ డ్యాన్స్‌ చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను స్నేహ రెడ్డి పోస్ట్ చేస్తూ ‘నా చిన్ని దెయ్యాలు’ అంటూ ముద్దుముద్దుగా కామెంట్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. కొంద‌రు భ‌య‌ప‌డిన‌ట్టు ఎమోజీల‌ను పోస్ట్ చేస్తున్నారు.

బ‌న్నీ కూతురు అర్హ త్వ‌ర‌లోనే వెండితెరపై క‌నిపించ‌బోతుంది. . సమంత గుణ శేఖర్ కాంబినేషన్‌లో రాబోతోన్నశాకుంతలం అనే ఫాంటసీ చిత్రంతో అర్హ నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో అర్హ నటించబోతోన్నట్టుగా ప్రకటించారు. అయితే ఇందులో అర్హ పాత్ర తీరు తెన్నుల గురించి సమంత చెప్పుకొచ్చారు.

ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ మూవీతో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మాస్ గెటప్‌లో పుష్పరాజ్‌గా కనిపించబోతున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. అతిత్వరలో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు సుకుమార్.