Allu Arjun: ఆరుబయట పిల్లలతో ఆనందంగా గడుపుతున్న బన్నీ.. వీడియో వైరల్

Allu Arjun: సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలెబ్రిటీలవుతున్నారు. సెలెబ్రిటీలు మరింత పాపులర్ అవుతుంటారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటివి వచ్చిన తర్వాత అభిమానులకు మరింత చేరవవుతున్నారు టాప్ సెలెబ్రిటీలు. ముఖ్యంగా సెలెబ్రిటీల పిల్లలు క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ లిస్ట్ లో టాలీవుడ్ మోస్ట్ స్టైలీష్ హీరో అల్లు అర్జున్ పిల్లలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వీరి అల్లరి చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా, అల్లు అయాన్ ల వీడియోని పోస్ట్ చేశారు స్నేహరెడ్డి.Allu Arjun

ఈ వీడియోలో అల్లు అర్జున్ ఇంటిబయట చల్లటి గాలికి పిల్లలతో సహా సేద తీరుతున్నారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ తో పాటు వారి పిల్లలు కూడా ఉన్నారు. అలాగే వారి మధ్య ఏదో సీరియస్ ఫన్ ఫ్యాక్ట్ డిస్కర్షన్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవ్వడంతో అల్లు వారి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అల్లు అర్హ పుట్టినరోజుకి రిలీజైన అంజలి కవర్ సాంగ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ భార్య.. అయాన్, అర్హ ల క్యూట్ ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. దీంతో అర్హ సోషల్ మీడియాలో స్టార్ క్యూటీ కిడ్ సెలెబ్రిటీ అయ్యారు.

Allu Arjunప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంటున్నారు. అలాగే రీసెంట్ గా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చి.. కోలుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో అద్దిరిపోయే లుక్ లో అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే ప్రాజెక్ట్ ల మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.