Allu Arjun: అఖిల్ సినిమా పాట వినుకుంటూ ఫ్యామిలీతో చ‌క్క‌ర్లు కొడుతున్న బ‌న్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌కి అభిమానుల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన భార్య స్నేహా రెడ్డికి సైతం స్టార్ హీరో వైఫ్‌గా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అల్లు స్నేహా రెడ్డి పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుండటమే అందుకు ఓ పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. స‌తీమ‌ణితో క‌లిసి బ‌న్నీ అప్పుడ‌ప్పుడు తెగ సంద‌డి చేస్తుంటాడు.

బ‌న్నీ కొద్ది రోజులుగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణకు కాస్త గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ మాల్దీవుల్లో ప్ర‌త్య‌క్షమ‌య్యాడు. అది కూడా ఫ్యామిలీతో స‌హా. ఇప్పుడు బ‌న్నీ మాల్దీవుల్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎంజాయ్ చేసి రీసెంట్‌గా హైద‌రాబాద్‌కి వ‌చ్చాడు.

ఇక బ‌న్నీ స్వ‌యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. స్నేహా త‌న సోష‌ల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయ‌గా, ఇది ఆక‌ట్టుకుంది. ఇందులో బ‌న్నీ.. అఖిల్ న‌టించిన‌మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాలోని గుచ్చే గులాబి లాగా సాంగ్ వినుకుంటూ చ‌క్క‌ర్లు కొడుతున్నాడు.

‘గుచ్చే గులాబి లాగా’. ఈ సాంగ్ కూడా రిలీజైన రోజు నుంచే యూట్యూబ్లో అందర్నీ ఆకట్టుకుంటూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ , శ్రీమని సాహిత్యం అదించిన ఈ పాటను బాలివుడ్ సింగర్‌ అర్‌మాన్ మాలిక్ ఆలపించారు. ఆ తరువాత రిలీజైన ‘యే జిందగీ’ సాంగ్ కూడా నెట్టింట సూపర్ హిట్ గా నిలిచింది.

ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం పుష్ప. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. రంగ స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కూడా కావ‌డంతో సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా పుష్ప ది రైజ్ కోసం వేచి చూస్తున్నాయి.