Allu Arha: శాకుంత‌లం చిత్రంతో డెబ్యూ ఇవ్వ‌నున్న బ‌న్నీ కూతురు..!

Allu Arha: ఇండ‌స్ట్రీకి వార‌సుల హ‌వా కొత్తేమి కాదు. వార‌సులు కొంద‌రు బాల న‌టులుగా వెండితెర ఎంట్రీ ఇవ్వ‌గా, కొందరు హీరోలుగా ప‌రిచ‌యం అయ్యారు. ఇప్ప‌టికీ వార‌సుల హ‌వా కొన‌సాగుతూనే ఉంది. అయితే కొద్ది రోజులుగా అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అర్హ వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది.

Allu Arha

అర్హ నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. తన క్యూట్‌నెస్‌తో ఇప్పటికే అభిమానుల్లో క్రేజ్‌ సంపాదించుకుంది. అర్హకు సంబంధించి ఫోటోలు, వీడియోలను స్నేహరెడ్డి, బన్నీ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. దీంతో నాలుగేళ్ల వ‌య‌సులోనే అర్హ బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది.

టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్న ప్రాజెక్టులో అర్హ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు రాగా, ఇప్పుడు ఇది క‌న్‌ఫాం అయింది. గుణ‌శేఖ‌ర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మించ‌నున్న శాకుంత‌లం చిత్రంలో అర్హ న‌టించ‌నుంది. చిన్న‌ప్ప‌టి స‌మంత పాత్ర‌లో అర్హ న‌టించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. అర్హ ఇప్పటికే అల వైకుంఠ‌పురములోని ఓ మై డాడీ అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌లో క‌నిపించి అల‌రించగా.. ‘అంజలి అంజలి’ వీడియో సాంగ్ ను కూడా రీక్రియేట్ చేసి విడుదల చేసిన వీడియోకి సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి.

Allu Arha

శాకుంత‌లం చిత్రం గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. శకుంతల, దుష్యంతుడు మహారాజుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారట చిత్ర యూనిట్. ఆపై వెంటనే థియేటర్స్ లో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స‌మంత స్పెష‌ల్ అట్రాక్ష‌న్ కాగా, ఇప్పుడు అర్హ కూడా న‌టిస్తుందంటే మూవీపై హైప్స్ భారీగా పెర‌గ‌డం ఖాయం.