Allu Arjun: వెండితెర ఎంట్రీకి బ‌న్నీ కూతురు రెడీ..!

Allu Arjun: సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా కొత్తేమి కాదు. ఇప్ప‌టికే చాలా మంది స్టార్స్ పిల్ల‌లు వెండితెర‌పై హీరోలుగా స‌త్తా చాటుతున్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గాను కొంద‌రు అరంగేట్రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌న్నీకూతురు అర్హ వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమ‌స్సో ఆయ‌న పిల్ల‌లు కూడా అంతే ఫేమస్. అల్లు అర్జున్ లేదంటే ఆయ‌న స‌తీమ‌ణి స్నేహా రెడ్డి పిల్ల‌ల‌కు సంబంధించిన అల్ల‌రిని లేదంటే వారి డ్యాన్స్ వీడియోల‌ను త‌ర‌చు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలో పిల్లలు ఇద్ద‌రికి సోష‌ల్ మీడియాలో అశేష ఫాలోయింగ్ ఏర్ప‌డింది. గ‌త కొద్ది రోజులుగా అర్హ వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి.

తాజాగా బ‌న్నీ తన కూతురు అర్హను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అర్హను పెట్టి ‘అంజలి అంజలి’ వీడియో సాంగ్ ను రీక్రియేట్ చేశారు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి. ఇక అల వైకుంఠ‌పుర‌ములో ప్ర‌మోష‌న్ సాంగ్ లోను అర్హ ద‌ర్శ‌న‌మిచ్చి సంద‌డి చేసింది. ఇప్పుడు అల్లు అర్హ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు పిల్లల కాన్సెప్ట్ తో ఓ సినిమా తీయబోతున్నారు. ఇందులో అల్లు అర్హను లీడ్ రోల్ లో తీసుకోవాలనుకుంటున్నారు. ఈ సినిమాతో సురేష్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది. ఈ సినిమాలో అర్హతో పాటు అయాన్ కూడా క‌నిపిస్తాడ‌ని కొంద‌రు చెబుతున్నారు.

ఇక బన్నీ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది. డిసెంబ‌ర్‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.