Allu Arjun: అపోలో ఆసుప‌త్రిలో సాయిధ‌ర‌మ్‌ని ప‌రామ‌ర్శించిన అల్లు అర్జున్

Allu Arjun: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబ‌ర్ 10న రోడ్డు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత‌న్ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శిస్తున్నారు. తేజూ కోలుకుంటున్నాడ‌ని, త్వ‌ర‌లోనే మ‌న ముందుకు వ‌స్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

తేజు నడుపుతున్న బైక్ ప్ర‌మాదం త‌ర్వాత‌ ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి స్పందించి 108కు సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత అతను ఎవరనే విషయం పైన ఆరా తీసారు. ఆ వ్యక్తి పేరు అబ్దుల్ అని గుర్తించారు. అతను స్థానికంగా ఒక షాపింగ్ మాల్ లోని వ్యాలెట్‌ పార్కింగ్‌ నిర్వహించే వ్యక్తి అని తెలిసింది.

అత‌ని స‌మాచారం ఆధారంగా వ‌చ్చిన 108 తేజూని ముందుగా మాదాపూర్ లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న స్నేహితుల ద్వారా ముందుగా మెగా ఫ్యామిలీలో సమాచారం అల్లు అర్జున్ కు తెలిసింది. ఆ సమయంలో బన్నీ కాకినాడలో పుష్ప షూటింగ్‌లో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉంది…ట్రీట్ మెంట్ ఎలా సాగుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ ఫ్యామిలీ మెంబర్స్ ను అలర్ట్ చేసారు.అయితే బ‌న్నీపై కొంద‌రు నెటిజ‌న్స్ ఫైర్ అయ్యారు. తేజూని ప‌రామ‌ర్శించ‌క‌పోగా, క‌నీసం ఆయ‌న గురించి ఎలాంటి పోస్ట్ చేయ‌లేద‌ని అన్నారు. కాని ఆ వార్త‌ల‌పై బ‌న్నీ మండి ప‌డ్డాడ‌ని స‌మాచారం.

అయితే హైద‌రాబాద్ చేరుకున్న బ‌న్నీ కొద్ది సేప‌టి క్రితం అపోలోలో చికిత్స పొందుతున్న తేజూని ప‌రామ‌ర్శించారు.సింగిల్‌గానే వ‌చ్చిన బ‌న్నీ..తేజూ ఆరోగ్యం గురించి డాక్ట‌ర్స్‌ని అడిగి తెలుసుకున్న‌ట్టు స‌మాచారం. కాగా, అపోలోలో సాయి ధరమ్ తేజ్ కు చేసిన కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయింది.