Allu Arjun And Trivikram Srinivas : పుష్ప సినిమాతో ఇరకాటంలో పడ్డ త్రివిక్రమ్.. కొత్త తలనొప్పి షురూ..!
NQ Staff - June 21, 2023 / 11:36 AM IST

Allu Arjun And Trivikram Srinivas : అదేంటో గానీ త్రివిక్రమ్ ను ఇప్పుడు పుష్ప సినిమా ఇబ్బందుల్లో పడేసింది. అదేంటి అసలు పుష్ప సినిమాకు ఆయనకు సంబంధం లేదు కదా అని మీరు అనుకుంటున్నారు కదా.. కానీ అక్కడికే వస్తున్నాం ఆగండి. టాలీవుడ్ సినిమాల్లో త్రివిక్రమ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.
అయితే దీని తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత బన్నీవాసు రీసెంట్ గా తెలిపారు. వచ్చే ఏడాది అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తామని తెలిపాడు. అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ డైరెక్టర్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్-త్రివిక్రమో కాంబోకు మంచి క్రేజ్ ఉంది.
ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మార్కెట్ మారిపోయింది. ఆయనకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఈ క్రమంలో లోకల్ ఫేవర్ తో కాకుండా అన్ని భాషల్లో వారు నచ్చే విధంగా కథను రాసుకుని సినిమాను తీయాలి.
ఇదే ఇప్పుడు త్రివిక్రమ్ కు పెద్ద సమస్యగా మారిపోయింది. త్రివిక్రమ్ మహేశ్ సినిమా తర్వాతనే అల్లు అర్జున్ సినిమా గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. బన్నీ సినిమా త్రివిక్రమ్ కు లేని తలనొప్పిగా మారిపోయింది. మరి పాన్ ఇండియా సవాల్ ను త్రివిక్రమ్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.