Allu Arjun: అట్ల త‌ద్ది వేడుక జ‌రుపుకున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఫొటో హ‌ల్‌చ‌ల్‌

Allu Arjun: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో అల్లు అర్జున్- స్నేహా రెడ్డి జంట ఒక‌టి. ఈ జంట ప్ర‌తి పండుగ‌ను చాలా చ‌క్క‌గా జ‌రుపుకుంటూ ఉంటారు. అలానే బ‌న్నీ త‌న‌కు ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా ఫ్యామిలీని తీసుకొని షికార్లకి వెళుతుంటాడు. అయితే తెలుగు వారి జీవితాల‌లో అట్ల‌త‌ద్దికి అంత ప్రాధాన్య‌త ఉంది. ఆడ‌పిల్ల‌లు ఆడుతుంటే, మ‌గ పిల్ల‌లు ఆట ప‌ట్టిస్తారు.

TheNewsQube-
Allu Arjun and Sneha Celebrating Atla Taddi Function
Allu Arjun and Sneha Celebrating Atla Taddi Function

ఎవ్వ‌రు ఎవ‌రితోనూ గొడ‌వ‌ప‌డ‌రు. ఆట ప‌ట్టించ‌టాన్ని కూడా ఆనందంగా స్వీక‌రిస్తారు. తెల్ల‌వారుజామునే పిల్ల‌లంతా పొర‌ప‌చ్చాలు, హెచ్చుత‌గ్గులు.. ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఆడుకుంటారు. ఐక‌మ‌త్యానికి ఈ పండుగ ప్ర‌తీక‌గా క‌నిపిస్తుంది. అమ్మ వేసే అట్లను కడుపు నిండా తినాలి. కొందరైతే వాయినాలు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయంలో భాగం.

ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు దురదగుంటాకుతో వచ్చి ఆడపిల్లల్ని సరదాగా ఆటపట్టించటం, ఈ ఆడపిల్లలు వారిని బెదిరించటం… ఇదీ ఆడమగ తేడా లేకుండా అందరం ఒకటే అనే భావనతో సరదాసరదాగా నడిచే పండుగ. ఎక్కడా శృతిమించని సరదాల వేడుక ఈ పండుగ.

తాజాగా అట్ల త‌ద్ది వేడుక‌ని బ‌న్నీ ఫ్యామిలీ జ‌రుపుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న బన్నీ.. ఈ షూటింగ్‌కి కాస్త బ్రేక్ దొరకడంతో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ మేరకు మాల్దీవుల అందాలు చుట్టివచ్చిన ఆయన, రీసెంట్‌గా హైదరాబాద్‌ రోడ్లపై లాంగ్ డ్రైవ్ చేశారు. తాజాగా అట్ల త‌ద్ది వేడుక జ‌రుపుకున్నారు.ఇందుకు సంబంధించిన పిక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

బ‌న్నీ న‌టిస్తున్న పుష్ప చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మునుపెన్నడూ చూడని కథను ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన రష్మిక మందన నటిస్తోంది. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక కనిపించనుంది.