Sakshi Excellence Awards: అవార్డుల వేడుక‌.. పోటీ ప‌డ్డ మ‌హేష్, బ‌న్నీ

Sakshi Excellence Awards: అవార్డుల వేడుకలు చూసి చాలా కాలం అయింది. క‌రోనా వ‌ల‌న ఆగిన అన్ని కార్య‌క్ర‌మాలు ఇప్పుడు మ‌ళ్లీ మొద‌ల‌వుతున్నాయి. తాజాగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది.

Allu Arjun and Mahesh Babu Leads Sakshi Excellence Awards
Allu Arjun and Mahesh Babu Leads Sakshi Excellence Awards

గ‌త ఏడాది సంక్రాంతి బ‌రిలో నిలిచిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం నాన్ బాహుబ‌లి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. ఈ సినిమా కు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ అందుకోగా… థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించాడు.

 

త‌మ చిత్ర బృందం అవార్డులు అందుకోవ‌డాన్ని సంతోషించిన బ‌న్నీ సోషల్ మీడియాలో పూజా, త్రివిక్రమ్, రాధా కృష్ణ, థమన్ లతో కలిసి ఉన్న పిక్ ను పంచుకున్నారు. ఆ పిక్ కు “అల సాక్షి అవార్డ్స్ లో” అని కామెంట్ చేశాడు. ఇక ఈ అవార్డ్స్ వేడుకలో 2019 సంవత్సరానికి గాను సూపర్ స్టార్ ఉత్తమ నటుడిగా నిలిచారు.

Allu Arjun and Mahesh Babu Leads Sakshi Excellence Awards
Allu Arjun and Mahesh Babu Leads Sakshi Excellence Awards

ఈ కార్యక్రమంలో మహేష్ బాబు స్వయంగా అవార్డు అందుకున్నారు. “మహర్షి” మరో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకున్నాడు. 2019 లో విడుదలైన సినిమాలలో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అవార్డు అందుకున్నారు. “మహర్షి” డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది.

Allu Arjun and Mahesh Babu Leads Sakshi Excellence Awards
Allu Arjun and Mahesh Babu Leads Sakshi Excellence Awards

ఎంతో సంద‌డిగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో ప్ర‌సారం కానుంది. కాగా, “అల వైకుంఠపురములో” 2020 జనవరి 12 న థియేటర్లలో విడుదలైంది. ఆ సమయంలో ఈ చిత్రం మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” పోటాపోటీగా విడుదలయ్యాయి. అయిన‌ప్ప‌టికీ అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం మంచి విజ‌యం సాధించింది.