Allu Arjun: కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. సాక్ష్యం ఇదిగో..!

Allu Arjun: ఏంటి.. అల్లు అర్జున్, కే విశ్వనాథ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..? ఇదేం విచిత్రం అనుకుంటున్నారు కదా..? రావడం కాదు.. ఆల్రెడీ వచ్చేసింది.. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే సినిమా చేసారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ సినిమా వచ్చి కూడా దాదాపు 30 ఏళ్ళు దాటిపోయింది.

Allu Arjun Acts in Swathi Muthyam Movie
Allu Arjun Acts in Swathi Muthyam Movie

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్క నటుడు కూడా కళాతపస్వి సినిమాల్లో కనిపించాలని కలలు కంటుంటారు. అందుకే చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా తను ఉంటున్న కమర్షియల్ దారిని కాదని అప్పుడప్పుడూ విశ్వనాథ్ గారితో సినిమాలు చేసాడు. ఈయన కెరీర్ లో శుభలేక, స్వయంకృషి, ఆపద్భాందవుడు సినిమాలు ప్రత్యేకంగా నిలిచిపోయాయి.ఎవరికి ఎలాంటి సినిమా ఇచ్చినా కూడా అది ఆయన కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

Allu Arjun Acts in Swathi Muthyam Movie
Allu Arjun Acts in Swathi Muthyam Movie

అలాంటి లెజెండరీ దర్శకుడితో అల్లు అర్జున్ చేసిన సినిమా ఏంటో తెలుసా..? కమల్ హాసన్ హీరోగా వచ్చిన స్వాతిముత్యం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. అల్లు అర్జున్ బాల నటుడిగా రెండు సినిమాల్లో నటించాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ బ్యానర్ కాగా.. మరోటి పూర్ణోదయా ఆర్ట్స్. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిగా కాసేపు కనిపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా 1986లో విడుదలైంది.

ఐదేళ్ళ వయసులో బన్నీ ఈ చిత్రంలో నటించాడు. దానికంటే ముందు విజేత సినిమాలో కూడా నటించాడు బన్నీ. తర్వాత యంగ్ ఏజ్ కు వచ్చిన తర్వాత డాడీ సినిమాలో కాసేపు డాన్సర్ గా కనిపించాడు. ఆ వెంటనే గంగోత్రి సినిమాతో హీరో అయ్యాడు. అక్కడ్నుంచి బన్నీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటుడిగానే ఆకట్టుకున్నాడు అల్లు వారబ్బాయి.

స్వాతి ముత్యం, విజేత తర్వాత బన్నీకి మరిన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆయన తండ్రి అల్లు అరవింద్ మాత్రం ఒప్పుకోలేదు. చదువు పక్కదారి పడుతుందని సినిమాలకు దూరంగా ఉంచాడు. ఏదేమైనా ఈ తరం హీరోలంతా కళాతపస్వి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు కానీ ఆ అరుదైన అవకాశం మాత్రం అల్లు అర్జున్ కు మాత్రమే దక్కింది