Allu Arha: షూటింగ్‌లో జాయిన్ అయిన అర్హ‌.. గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పిన టీం స‌భ్యులు

Allu Arha: అల్లు ఫ్యామిలీ నుండి మ‌రొక‌రు వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే.అల్లు రామ‌లింగ‌య్య వార‌సుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర‌వింద్ నిర్మాత‌గా ఎదిగాడు. ఆ త‌ర్వాత ఆయ‌న వార‌సులిగా వచ్చిన అల్లు శిరీష్, అల్లు అర్జున్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇంకో త‌న‌యుడు నిర్మాత‌గా గ‌ని సినిమాతో మార‌బోతున్నాడు.

సమంత ‘శాకుంతలం’ సినిమాతో అర్హ వెండితెర ఎంట్రీ ఇస్తుంద‌ని కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అల్లు అర్హ ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే 10 రోజుల షూటింగ్‌లోపాల్గొన్న అల్లు అర్హ.. తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి జాయిన్ అయింది.

షూటింగ్‌లో జాయిన్ అయిన అర్హ‌కు సంబంధించిన వీడియోని తాజాగా విడుద‌ల చేయ‌గా, ఇందులో అర్హ ముఖానికి మేక‌ప్ వేసుకుంటుంది. చిన్నారికి టీం గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పిన‌ట్టు తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అర్హ ఈ సినిమాతో అల‌రించ‌నుండ‌గా, ఇంత‌క‌ముందు అల వైకుంఠ‌పుర‌ములోని ప్ర‌మోష‌నల్ వీడియో సాంగ్‌లో క‌నిపించి అల‌రించింది.

శాకుంతలం సినిమాను మహాభారత గాథలోని ఆదిపర్వంలో ఉన్న అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుంది. ఇందులో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.