Allu Aravind : అల్లు అరవింద్ ‘రామాయణం’ ఎక్కడిదాకా వచ్చింది.?
NQ Staff - October 18, 2022 / 10:29 PM IST

Allu Aravind : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చాలాకాలం క్రితమే ‘రామాయణం’ అనే సినిమా తెరకెక్కించాలనుకున్నారు. అప్పటినుంచీ ఆ సినిమాకి సంబంధించిన కసరత్తులు జరుగుతూనే వున్నాయి. రోజులు, నెలలే కాదు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి. కానీ, ‘రామాయణం’పై అప్డేట్ రావడంలేదు. అసలు ‘రామాయణం’ అనేది అల్లు అరవింద్ నుంచి సినిమాగా వస్తుందా.? లేదా.? ఈ విషయమై అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
నాలుగేళ్ళ క్రితమే ‘రామాయణం’ సినిమా పనులు ప్రారంభమయ్యాయనీ, ప్రస్తుతం ఇంకా ప్రీ-ప్రొడక్షన్ జరుగుతూనే వుందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. సంవత్సరాలు పడుతుందట.. ఇప్పట్లో ‘రామాయణం’ సినిమా సెట్స్ మీదకు వెళ్ళేలా లేదు. ఎందుకంటే, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా సమయం పడుతుందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఒక్కసారి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిపోతే, భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్టుతో ఆ సినిమాని తెరకెక్కించడం జరుగుతుందని ఆయన స్పష్టతనిచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి మరో లెవల్‌కి వెళ్ళింది. సో, అల్లు అరవింద్ ఇప్పుడు కాస్త తొందరపడక తప్పదు. నిదానమే ప్రదానమన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆలస్యం అమృతం విషం కూడా.! ట్రెండ్ సానుకూలంగా వుంది గనుక, ‘రామాయణం’పై అల్లు అర్జున్ స్పెషల్ ఫోకస్ పెడితే మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ, ‘రామాయణం’లో రాముడిగా నటించేది రామ్ చరణ్ అనుకోవచ్చా.?