Mohan Babu: బాల‌య్య రూట్లో మోహ‌న్ బాబు.. అల్లు అర‌వింద్ ప్లాన్స్ మూములుగా లేవు..!

Mohan Babu: మొన్నామ‌ధ్య ఓ ఈవెంట్‌లో బాల‌కృష్ణ‌.. అల్లు అర‌వింద్‌ని ఉద్దేశించి పొట్టోడే కాని గ‌ట్టోడు అన్నాడు. అల్లు అరవింద్ ఒక‌ప్పుడు నిర్మాత‌గా అద్భుత‌మైన సినిమాలు చేసి టాప్ ప్రొడ్యూస‌ర్‌గా నిలిచాడు.ఇప్పుడు ఆహా అనే ఓటీటీ సంస్థ‌ని స్థాపించి దీని ద్వారా పసందైన వినోదం పంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆహా పెట్టినప్పుడు అది మెగా హీరోల సినిమాలకు,షోలకు ఒక అడ్డాగా ఉండబోతోందని అందరూ భావించారు.

mohan babu

కానీ అల్లు అరవింద్ తీసుకునే నిర్ణయాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఆయన తెలుగు ఓటీటి మార్కెట్ లో మేజర్ షేర్ ని పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా స్టార్స్ ని తీసుకొచ్చి వెబ్ సీరిస్ లు, టాక్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్యతో ఓ టాక్ షో ప్లాన్ చేసారు. ఆ షో ప్రారంభం కాకముందే క్లిక్ అయ్యినంత క్రేజ్ తెచ్చుకుంది.

బాల‌య్య ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేక్ష‌కులు కూడా అన్‌స్టాప‌బుల్ షో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబ‌ర్ 4న ఇది ప్ర‌సారం కానుంది. ఇదిలా ఉంటే మోహన్ బాబు నిసైతం తమ ఆహా కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అర‌వింద్. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోహన్ బాబుతో అల్లు అరవింద్ ఓ వెబ్ సీరిస్ ప్లాన్ చేయబోతున్నారు.

తమిళ ఫిల్మ్ మేకర్ ఒకరు ఈ సీరిస్ నిమిత్తం కథ తో ఆహాని ఎప్రోచ్ అయ్యారని, సత్యరాజ్ తో చేద్దామని వాళ్ల ఆలోచన అయితే అల్లు అరవింద్ మాత్రం మోహన్ బాబు తో చేస్తే బాగుంటుందని చెప్పి టీమ్ తో ఎప్రోచ్ అవుతున్నట్లు సమచారం. ఇప్పటికే మంచు లక్ష్మి ఆహా లో ఓ షో చేస్తోంది. మోహ‌న్ బాబు షోపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్ల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మా గౌరవాన్ని , మా వృత్తి ని అవమానించుతు మాట్లాడారు. ఈ క్ర‌మంలో కొత్త‌గూడెంలోమోహన్ బాబు పై కేసు పెట్టడం జరిగింది