Allu Aravind : అనుపమతో అల్లు అరవింద్ డాన్సులు.! కుర్రాడైపోతున్న ప్రముఖ నిర్మాత.!
NQ Staff - December 26, 2022 / 09:01 AM IST

Allu Aravind : హీరోయిన్లపై పలు వేదికలపై చిలిపితనంతో కూడిన వ్యాఖ్యలు చేస్తుంటారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. అదే సమయంలో, హీరోయిన్ల విషయమై అత్యంత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలూ చేస్తుంటారాయన.
తాజాగా, అల్లు అరవింద్ కుర్రాడైపోయారు.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి డాన్సులేశారు. ‘18 పేజెస్’ సినిమా సక్సెస్ పార్టీలో అల్లు అరవింద్ చేసిన సందడికి అంతా విస్తుపోయారనడం అతిశయోక్తి కాదేమో.!
సుకుమార్ కూడా డాన్సులేసిన వైనం..
అల్లు అరవింద్ మాత్రమే కాదు, ‘లెక్కల మాస్టారు’.. టాలెంటెడ్ డైరెక్టరు.. సుకుమార్ కూడా డాన్సులేశారు. అలా అల్లు అరవింద్, సుకుమార్ డాన్సులేయడానికి కారణం అనుపమ పరమేశ్వరన్.. ఆమెకు తోడుగా నిఖిల్ కూడా.!
అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా నటించిన ‘18 పేజెస్’ ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ చేసుకుంది. సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతోపాటు, సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకున్నారు. అల్లు అరవింద్ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు.
కాగా, అల్లు అరవింద్ డాన్సులపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా పడుతున్నాయ్.