Virat Kohli : వివాదంలో విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్వాహ‌కులు

Virat Kohli : భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వివాదంలో నిలిచింది. కోహ్లీకి దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు ఉండగా పూణెలోని రెస్టారెంట్‌‌పై ‘ఎస్ వియ్ ఎగ్జిస్ట్ ఇండియా’ అనే ఎల్జీబీటీ క్యూఐఏ ప్లస్ కమ్యూనిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. స్వలింగ సంపర్కుల పట్ల ఈ రెస్టారెంట్‌ వివక్ష చూపుతోందని ఆరోపించింది.

Allegations on Virat Kohli restaurant
Allegations on Virat Kohli restaurant

వన్‌8 కమ్యూన్‌ పుణె బ్రాంచ్‌లో తమకు ఎదురైన చేదు అనుభవమే ఇందుకు నిదర్శనమని సదరు గ్రూపు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. తన రెస్టారెంట్‌ నిర్వాహకులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విషయం కోహ్లికి తెలిసి ఉండదన్న ‘‘ఎస్‌.. వి ఎగ్జిట్‌’’ గ్రూపు… ఏదేమైనా ఇలా తమ పట్ల వివక్ష చూపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వాపోయింది.

Allegations on Virat Kohli restaurant
Allegations on Virat Kohli restaurant

ఈ మేరకు..‘‘విరాట్‌ కోహ్లి నీకు ఈ విషయం తెలియదనే అనుకుంటున్నాం. వన్‌8 కమ్యూన్‌ పుణె బ్రాంచ్‌ ఎల్‌జీబీటీక్యూఐఏ గెస్టుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మీ రెస్టారెంటులోని మిగతా బ్రాంచీలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయి. ఇది మేమసలు ఊహించలేదు. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు నిబంధనలు మారుస్తారనే అనుకుంటున్నాం.

జొమాటోకు కూడా మా విజ్ఞప్తి. ఇలాంటి రెస్టారెంట్లతో మీరు భాగస్వామ్యం కావొద్దు’’ అని ‘‘ఎస్‌.. వి ఎగ్జిట్‌’’ గ్రూపు ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్‌ చేసింది. అయితే, ఈ విషయంపై స్పందించిన రెస్టారెంట్‌ నిర్వాహకులు.. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు. తాము కేవలం స్టాగ్స్‌ ఎంట్రీ(ఒంటరిగా వచ్చే అబ్బాయిలు)పై మాత్రమే ఆంక్షలు విధించామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వన్‌8 కమ్యూన్‌ పుణె బ్రాంచ్‌కు చెందిన అమిత్‌ జోషి మాట్లాడుతూ.. ‘‘మేమెలాంటి లింగ వివక్ష చూపడం లేదు. ఒంటరిగా వచ్చే అబ్బాయిలను మాత్రమే లోపలికి అనుమతించడం లేదు. అది కూడా మహిళల భద్రతా దృష్ట్యా. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ లేదు’’ అని వివరణ ఇచ్చారు.