Narappa: నారప్పపై అంద‌రు స్టార్ హీరోల దృష్టి.. ఎందుకో తెలుసా?

Narappa:వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించిన నారప్ప సినిమా జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దానికితోడు మణిశర్మ అందించిన సంగీతం కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. తాజాగా నారప్ప సినిమాలో నుంచి రెండో సింగిల్ కూడా విడుదలైంది. హుషారుగా సాగిపోయే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదంతా ఇలా ఉంటే నారప్ప సినిమా థియేటర్లలో కాకుండా డిజిటల్ మీడియాలో విడుదల కావడంపై విక్టరీ వెంకటేష్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.

ఆ మధ్య ఒక అభిమాని వెంకటేష్ సినిమా థియేటర్ లో విడుదల చేయాలని ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై అభిమానులకు వెంకీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లో థియేటర్లలో విడుదల చేయడం కుదరడం లేదని.. ఇంటిల్లిపాది నారప్ప సినిమాను ఇంట్లోనే కూర్చొని సేఫ్ గా చూసి ఆనందించండి అంటూ ట్వీట్ చేశాడు వెంకటేష్. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కోసం కేవలం వెంకటేష్ అభిమానులు మాత్రమే కాదు..

ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ నిర్మాతలు వేచి చూస్తున్నారు. దీనికి వచ్చే రెస్పాన్స్ చూసిన తర్వాత తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోనున్నారు. కేవలం నారప్ప మాత్రమే కాదు.. చాలా సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే సురేష్ బాబు ధైర్యం చేశాడు.. అలా మిగిలిన నిర్మాతలు కూడా తమ సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేయాలా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకవేళ మంచి రేటు వస్తే నేరుగా ఆన్లైన్లో విడుదల చేయడం మంచిదని ఇప్పటికే సురేష్ బాబు తెలిపాడు.

అందుకే నారప్ప విడుదలైతే.. దానికి వచ్చే రెస్పాన్స్ చూసి మరికొందరు స్టార్ హీరో సినిమా నిర్మాతలు కూడా ఇదే దారిలో వెళ్లలా లేదా అని ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనా కూడా జూలై 20వ తేదీ కోసం చాలా మంది నిర్మాతలు మాత్రం చేస్తున్నారు. వెంకటేష్ దృశ్యం 2, రానా విరాట పర్వం, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నిఖిల్ 18 పేజెస్ లాంటి సినిమాలను కూడా ఓటిటిలోనే విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.