Aaliyah Kashyap: ప్రియుడితో మ‌రింత రొమాంటిక్‌గా… ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

Aaliyah Kashyap: సోషల్ మీడియా ప్రభావం పెరిగాక అటు సెలబ్రిటీలు, ఇటు సాధారణ ప్రజలు హ‌ద్దులు మ‌ర‌చి ర‌చ్చ చేస్తున్నారు. సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు, వారి వారి పిల్లలు హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తుండగా.. నెటిజన్లు నీచమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రోలింగ్స్‌తో పాటు బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నారు సెలబ్రిటీలు. అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ కూతురికి ఇవ‌న్నీ కామ‌న్‌గా మారాయి.


Aliyah Kashyap's Romantic Pics with her Boy friend Goes Viral
Aliyah Kashyap’s Romantic Pics with her Boy friend Goes Viral

ఆలియా క‌శ్య‌ప్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన‌ ఆలియా కశ్యప్ ఆన్‌లైన్ వేదిక‌గా హాట్ ఫొటోస్ షేర్ చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌దు. ఓ సంద‌ర్భంలో బికినీ ఫొటోలు షేర్ చేసినందుకు గాను అసహ్యమైన కామెంట్స్ చేశారని, తనను వేశ్యతో పోల్చుతూ ‘ఒక్క రాత్రికి నీ రేటెంత?’ అని అడుగుతున్నారని ఆలియా చెప్పుకొచ్చింది.


Aliyah Kashyap's Romantic Pics with her Boy friend Goes Viral
Aliyah Kashyap’s Romantic Pics with her Boy friend Goes Viral

కొందరైతే ఏకంగా రేప్ చేస్తాం, చంపేస్తాం అని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు ఆమె పేర్కొంది. కేవలం ఇండియన్ కావడం వల్ల అల్లాంటి పోస్ట్‌లు చేయడం పట్ల సిగ్గుపడాలని తనకు చెప్తున్నారని చెప్పింది. అయితే ఈ అమ్మ‌డు కొన్నాళ్లుగా షేన్‌ గ్రెగోయిర్ అనే వ్య‌క్తితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. ఇద్ద‌రు చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉండ‌దు.


Aliyah Kashyap's Romantic Pics with her Boy friend Goes Viral
Aliyah Kashyap’s Romantic Pics with her Boy friend Goes Viral

రీసెంట్‌గా అత‌ను 22వ బ‌ర్త్ డే జ‌రుపుకున్ఆడు. ఈ సంద‌ర్భంగా ఆలియా త‌న సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా నన్ను మార్చావు. నిన్ను కలిసినందుకు నేనెంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు! ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ ప్రేమికుడు షేన్‌ గ్రెగోయిర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపింది.


Aliyah Kashyap's Romantic Pics with her Boy friend Goes Viral
Aliyah Kashyap’s Romantic Pics with her Boy friend Goes Viral

అంత‌టితో ఆగ‌ని ఈ ముద్దుగుమ్మ అతనితో చాలా స‌న్నిహితంగా ఉన్న పిక్స్ కూడా షేర్ చేసింది. దీంతో నెటిజ‌న్స్ ఆమెను విప‌రీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మీ నాన్న సినిమాలు చూసి ఇలా త‌యార‌య్యావు. అభిమానులతో ఇలాంటా ఫొటోలు పంచుకుంటారా అంటూ దారుణంగానే ట్రోల్స్ చేశారు.

డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన షేన్‌తో ప్రేమలో పడిన అలియా ఈ విషయాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. గ‌తంలో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న కోసం ఎంతో ప‌రిత‌పించిన‌ట్టు పేర్కొంది. రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత తొలిసారి తనను కలిశాను. తను నన్ను ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకుంటాడా అని ఎదురుచూశాను. అయితే, తను మాత్రం కాస్త సందేహించాడు. నేనే ధైర్యం చేసి ముద్దుపెట్టేశాను. తను అంటే నాకు అంతగా ఇష్టం ఏర్పడిపోయింది’’ అంటూ త‌న ప్రేమ‌ను చాటుకుంది.