Alitho Saradagaa: ఆలీ షో బిహైండ్ సీక్రెట్స్.. గెస్ట్‌లకు ఎంత డ‌బ్బులిస్తారు ?

Alitho Saradagaa: బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న క్రేజీ టాక్ షోల‌లో ఆలీతో స‌ర‌దాగా కూడా ఒక‌టి. ఈ షోకి చాలా ఆద‌ర‌ణ ఉంటుంది.ఇండ‌స్ట్రీకి చెందిన పాత‌త‌రం, కొత్త‌త‌రం న‌టీన‌టులు ఈ కార్యక్ర‌మానికి హాజ‌రై ఎన్నో విష‌యాలు చెబుతుంటారు. ముఖ్యంగా హోస్ట్‌గా ఉన్న ఆలీ వ‌చ్చే గెస్ట్‌ల‌తో చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌క్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ షోకి రేటింగ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

Alitho Saradagaa Show Inside Details1
Alitho Saradagaa Show Inside Details1

సీనియ‌ర్ క‌మెడీయ‌న్ ఆలీకి ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్స్ అంద‌రితో స‌న్నిహిత సంబంధాలు ఉండ‌డం వ‌ల‌న ఆయ‌న గెస్ట్‌ల‌ను సులువుగా అన్ని ప్ర‌శ్న‌లు అడుగుతుంటారు. అలాగే ప్రేక్ష‌కుల మ‌ధ్య గెస్ట్‌తో అలీ చేసే సంద‌డి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటుంది. కోవిడ్ స‌మ‌యంలోను ఈ షోని స‌క్సెస్ ఫుల్‌గా నిర్వ‌హిస్తున్నారు నిర్వాహ‌కులు.

ఆలీతో స‌ర‌దాగా షోలో ఒక్కో సారి సెల‌బ్స్ చెప్పే విష‌యాలు వివాదాలు కూడా పుట్టిస్తుంటాయి. అయితే ఈ షోకి ఇప్ప‌టికే చాలా మంది గెస్ట్‌లు హాజ‌రు కాగా, కొత్త‌వారిని వెతికి ప‌ట్టుకు రావ‌డం మేనేజర్స్‌కు కూడా తలకు మించిన భారంగా మారుతుంది. మ‌రి ఈ షోకి వ‌చ్చే గెస్ట్‌లు ఫ్రీగా వ‌స్తారా లేదంటే కొంత మొత్తం ఇస్తారా అనే అనుమానం అంద‌రిలో క‌లుగుతుంది.

అయితే ఏ షోస్‌కి అయిన సెల‌బ్రిటీలు గెస్ట్‌లుగా వస్తే వారి రేంజ్‌ని బ‌ట్టి రెమ్యున‌రేషన్ ఇస్తుంటారు. ఒక్కోసారి కొంద‌రు త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఫ్రీగానే షోకు హాజ‌రై సంద‌డి చేస్తుంటారు. అయితే అలీతో సరదాగా షోకు వచ్చే అతిథులకు ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు ఇస్తారని తెలుస్తుంది. రేంజ్‌ను బట్టి వాళ్లకు ఫ్లైట్ టికెట్.. హోటల్ ఖర్చులు అదనం. ప్రత్యేకంగా వాళ్లను తీసుకొచ్చి షో పూర్తయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుని పంపిస్తారు.

ఆలీతో స‌ర‌దాగా షోలో ఎక్కువగా ఓల్డ్ సెలబ్రిటీస్‌ను తీసుకొస్తుంటారు. పాత వాళ్లను తీసుకొచ్చి వాళ్ల నుంచి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుంటాడు అలీ. ఈ మధ్య సుధాచంద్రన్, కోట, బాబు మోహన్, జాకీ, హరిత, అన్నపూర్ణమ్మ, వై విజయ లాంటి వాళ్లే ఎక్కువగా వచ్చారు. రీసెంట్‌గా స‌దా వ‌చ్చింది. స‌దా ఎపిసోడ్ ఎంత హైలైట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాను రాను ఈ షోకి ఆద‌ర‌ణ మ‌రింత పెరుగుతూ పోతుంది.