RRR: ఆర్ఆర్ఆర్ బ్యూటీ పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధం.. వేదిక ఎక్క‌డో తెలుసా..!

RRR: రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్న అందాల ముద్దుగుమ్మ అలియా భ‌ట్. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాషూటింగ్ పూర్తి చేసిన అలియా ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో బిజీగా ఉంది. అయితే ర‌ణ్‌బీర్‌ కపూర్‌తో వివాహం ఈ ఏడాది జ‌ర‌గ‌నుంద‌నిన గత కొంతకాలంగా వినిపిస్తోంది.

TheNewsQube-
alia marry ranbir kapoor
alia marry ranbir kapoor

అయితే వారి వివాహం ఎ‍ప్పుడన్నది మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికీ దానిపై అలియా కానీ, రణ్‌బీర్‌ కానీ నోరు మెదపడం లేదు. దీంతో ఈ స్టార్‌ జంట పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలో వీరి పెళ్లి అంశం మరోసారి బి-టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి ఖాయమని, రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జర‌గ‌నుంద‌ని అంటున్నారు.

నిజానికి వాళ్లు ఎప్పటికప్పుడు పెళ్లి దిశగా అడుగులు వేస్తూనే వచ్చారు. కానీ ఎప్పడూ ఏదో ఒక అవాంతరం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అభిమానులు కూడా డీలాపడుతూనే వచ్చారుఈ సారి మాత్రం తమ వైపు నుంచి వాళ్లు అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. రాజస్థాన్ లోని ‘ఐకానిక్’ ప్యాలెస్ లో పెళ్లి జరగనుంది.

alia marry ranbir kapoor.jpg 2
alia marry ranbir kapoor.jpg 2

బంధుమిత్రులను .. అత్యంత సన్నిహితులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ పెళ్లికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించనున్నారు. రణ్ బీర్ కపూర్ – అలియా భట్ ఇద్దరికీ కూడా ఎవరి సినిమాలు వారికి ఉన్నాయి. ఇద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ చేస్తున్నారు. ముందుగా ఆ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇద్దరూ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

గతంలో నటి లారా దత్త సైతం వీరి పెళ్లిపై స్పందిస్తూ 2021 డిసెంబర్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని, 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.