Alia bhatt: అంద‌రి దృష్టి ఈ అమ్మ‌డి పైనే.. స్టైలిష్ డ్రెస్‌లో అద‌ర‌గొట్టిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ

Alia bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌ళ్లుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. త్వ‌ర‌లో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ని డిసెంబర్ లో పెళ్లి చేసుకోనుంది. ఆదిత్య సీల్.. అనుష్క రంజన్ ఈరోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత రాత్రి అనుష్క- ఆదిత్య వారి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం గరిష్టంగా నగరంలో సూపర్ సంగీత్ వేడుక జరిగింది.

alia bhatt stunning look2
alia bhatt stunning look2

చాలా మంది సెలబ్రిటీలు ఈ ఫంక్షన్ కు విచ్చేసి స్టారీగా మార్చారు. ఆలియా భట్- క్రిస్టల్ డిసౌజా.. వాణి కపూర్.. భాగ్యశ్రీ.. రవీనా టాండన్.. భూమి పెడ్నేకర్ తదితరులు తమ అత్యుత్తమ వేషధారణలతో మైండ్ బ్లాక్ చేశారు. అయితే ఆలియా భట్ తనదైన మోడ్రన్ స్టైల్ లెహంగా-చోళీలో షో స్టాపర్ గా నిలిచింది.

alia bhatt stunning look1
alia bhatt stunning look1

ఇది క్రాస్ నెక్డ్ బ్లౌజ్ ఓపెన్ బ్యాక్. ఆలియా మైండ్ బ్లోయింగ్ లుక్ తో మతులు చెడగొట్టింది అంటూ అక్కడ చర్చ సాగింది. బ్రహ్మాస్త్ర నటి లైమ్-గ్రీన్ పింక్ లెహంగా ధరించి ఇతర నాయికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆదిత్య సీల్ – అనుష్క రంజన్ సంగీతం నుండి అలియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాంప్రదాయ వస్త్రధారణకు ఆర్ఐపీ అని ఒకరు పంచ్ విసిరారు. మరో సోషల్ మీడియా యూజర్ ఫ్యాషన్ డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ టు.. మిస్ అలియా భట్ అని వ్యాఖ్యానించారు. నెటిజనుల్లో ఒకరు ఆమెను బిగ్ బాస్ ఓటీటీ ఉర్ఫీ జావేద్ తో పోల్చారు. ఆమె ఉర్ఫీ జావేద్ లాగా ఉంది. మరో అభిమాని “యే అలియా నే క్యా ఫెనా హై?? ఫ్యాషన్ కే నామ్ పర్ కుచ్ భీ“ అని రాశాడు.

alia bhatt stunning look
alia bhatt stunning look

ఆలియా భ‌ట్‌.. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలియా పాత్ర‌కు సంబంధించిన లుక్స్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి నెటిజ‌న్స్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.