Pooja Bhatt: తాగుడికి బానిస‌య్యానంటున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ సోద‌రి

Pooja Bhatt: బాలీవుడ్ నిర్మాత మ‌హేష్ భ‌ట్ కూతురు, ఆర్ఆర్ఆర్ క‌థానాయికు అలియా భ‌ట్ సోద‌రి పూజా భ‌ట్ చాలా మందికి సుప‌రిచిత‌మే. ఎన్నో అద్భుత‌మైన సినిమాల‌లో న‌టించి మంచి హీరోయిన్ అనిపించుకుంది. మీటూ ఉద్య‌మం స‌మ‌యంలో ప‌లుమార్లు గ‌ళం వ‌ప్పిన పూజా భ‌ట్ తాజాగా కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తండ్రి మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘దిల్‌ హై కి మంతా నహీన్‌’ మూవీ జూలై 12తో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా పూజా ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

pooja Bhatt

దిల్ హైకి మంతా న‌హీన్ చిత్రంలో తాను మ‌ద్యానికి బానిసై తండ్రిని కాపాడుకునే కూతురి పాత్ర పోషించిన‌ట్టు చెప్పిన పూజా నిజ జీవితంలో కూడా మద్యానికి బానిసైయినట్లు వెల్లడించింది. నాలుగేళ్ల క్రితమే మానేశాను. దానిని నుంచి బయట పడాలనుకన్నాను. ఆ సమయంలో మద్యం నుంచి నా ఆలోచలను బయట పడేయడం చాలా కష్టంగా ఉండేది. చెప్పాలంటే అది ఒక పోరాటం’ అంటూ చెప్పుకొచ్చారు.

సాధార‌ణంగా ఇలాంటి విష‌యాలు చెప్ప‌డానికి ఆడ‌వాళ్లు భ‌య‌ప‌డుతుంటారు. స‌మ‌స్య అంద‌రిలో ఉంటుంది. ఆడ‌వాళ్లు కూడా అన్నింటిని నోరు విప్పాలి. అంద‌రిలో స్పూర్తిని నింపాల‌నే ఉద్దేశంతో ఇప్పుడు దీనిపై పెద‌వి విప్పాల్సి వ‌చ్చింది. తాగుడు నుంచి బయట పడేందుకు పెద్ద‌ పోరాటమే చేశాను’ అని పూజ అన్నారు.

pooja Bhatt

మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ హై కి మంతా నహీన్‌’ మూవీ పూజ భట్‌ లీడ్‌ రోల్‌ పోషించగా, తండ్రి పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటించాడు. ఇందులో ఆమీర్‌ ఖాన్‌ హీరో. అయితే ఈ సినిమాను తన నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా మహేష్‌ భట్‌ పలు ఇంటర్య్వూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

కాగా , బాలీవుడ్ ఇండస్ట్రీలో చెలరేగిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన‌ పూజా భట్ .. కంటికి కనిపించే ప్రతి వ్యక్తి లైంగిక నేరస్థుడు కాదని.. అలాగే ప్రతి మహిళ లైంగిక బాధితురాలు కాబోదన్నారు. ప‌లువురు ప్ర‌ముఖులు కూడా త‌న‌పై లైంగిక దాడి జ‌రిపార‌ని ఆ స‌మ‌యంలో చెప్పి హాట్ టాపిక్‌గా మారింది పూజా భ‌ట్.