Alia Bhatt-Ranbir Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా దగ్గరైంది. ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న అలియా భట్ ఏప్రిల్ 14న తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ని వివాహం చేసుకుంది. చాన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరు ఇద్దరు ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
నెటిజన్స్ ట్రోల్స్..
పెళ్లి అయి పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు, అలియా భట్ కొద్ది సేపటి క్రితం తాను ప్రగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.ఆమె స్కాన్ ను చూస్తున్న ఒక ఫొటో ను షేర్ చేశారు. అవర్ బేబీ కమింగ్ సూన్ అంటూ రాసుకొచ్చారు. దీంతో స్టార్ సెలెబ్రిటీలంతా అలియా భట్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు.

ప్రియాంక చోప్రా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, డయానా పెంటీ, కరణ్ జోహార్, మౌనిరాయ్, టైగర్ ష్రాఫ్ లాంటి ప్రముఖులంతా అలియా, రణబీర్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాని నెటిజన్స్ మాత్రం పెళ్లి అయి రెండు నెలల 13 రోజులే అయింది. ఇంత తొందరగా శుభవార్త చెప్పారు. ఇంత స్పీడ్ అయితే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొందరైతే అలియా పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయి ఉంటుందని, అందుకే హడావిడిగా పెళ్లి చేసుకొని ఉంటుందని రాసుకొస్తున్నారు. ఏదేమైన తమ అభిమాన హీరోయిన్ తల్లి కాబోతుందనే వార్త అలియా ఫ్యాన్స్‌కి ఆనందాన్ని కలిగిస్తుంది. వీరిద్దరూ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్రంలో కలసి నటిస్తున్నారు.
అలియా, రణబీర్ ఇద్దరూ బాలీవుడ్ స్టార్ కపుల్స్. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు కనుల పండుగలా ఉంటుంది. కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్న అలియా-రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చారు.