Alia Bhatt: ఆర్ఆర్ఆర్ సెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన అలియా భ‌ట్.. చ‌ర‌ణ్‌తో చిందులేయ‌నుందా?

Alia Bhatt: ప్రస్తుతం యావత్ సినీ ప్రేక్షకులు దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండడంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. భారీ బడ్జెట్‌తో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి కారణంగా రెండు సార్లు వాయిదాపడటం.. ఈ క్రమంలో సినిమా విడుదల కూడా వాయిపడటం అభిమానులను నిరాశపరిచింది.

alia bhatt
alia bhatt

వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్న షూటింగ్‌ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్నాడు. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తైంద‌ని చెప్పుకొచ్చిన ఆర్ఆర్ఆర్ టీం రెండు పాట‌లు బ్యాలెన్స్ ఉంద‌ని తెలియ‌జేసింది. ఇందులో రామ్ చ‌రణ్‌, అలియా భ‌ట్‌కి సంబంధించిన సాంగ్‌ని నేటి నుండి షూట్ చేయ‌నున్నారు జ‌క్క‌న్న‌. ఈ క్ర‌మంలో బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టింది.

ఈ రోజు ఉద‌యం అలియా భ‌ట్ త‌న ఇన్‌స్టా డైరీస్‌లో ఓ పోస్టు కూడా పెట్టింది. ఆర్ఆర్ఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో షూట్ కోసం త‌యార‌వుతున్న స‌మ‌యంలో దిగిన ఫోటోను ఆలియా అప్‌డేట్ చేసింది. రైజ్ అండ్ షైన్ అన్న ట్యాగ్ కూడా ఇచ్చిందామె. దీంతో అభిమానులు సాంగ్ షూట్ జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీం టీజర్లు, పోస్టర్ల ద్వారా చిత్ర యూనిట్ అభిమానులకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంది. ఫ్రీడం ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ జీవిత క‌థల‌ నేప‌థ్యంతో ఫిక్ష‌న్ మూవీ రూపంలో ఈ సినిమాను తీస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్లు, తాజాగా విడులదైన ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోలతో కలిపి ఓ ప్రమోషనల్ పాటని కూడా విడుదల చేయనున్నారని సమాచారం. అంతేకాక.. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్‌లో సినిమాను అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

అనిరుధ్‌తో స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేయిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇది పూర్త‌య్యాక టీం అంతా సాంగ్ పూర్తయ్యాక మొత్తం టీం జార్జియాకు ప్రయాణం కానుంది. అక్కడ సినిమాలోని భారీ సాంగ్ ను చిత్రీకరిస్తారు. దాంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా అలియా భట్, అజయ్ దేవగన్ ఇద్దరూ మరో రెండు ప్రధాన ఆకర్షణలు.