Ali: ఆలీ స‌డెన్ ఎంట్రీ , బిగ్ బాస్ కోస‌మేనా?

Ali: ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాకి దూరంగా ఉన్న సెల‌బ్రిటీలు ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెడుతున్నారు. వ‌చ్చీ రావ‌డంతోనే వ‌రుస పోస్ట్‌లు చేస్తూ తెగ సంద‌డి చేస్తున్నారు. ఆ మ‌ధ్య లాక్ డౌన్ స‌మయంలో చిరంజీవి ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు కమెడీన్ అలీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి లేట్ అయిన లేటెస్ట్‌గా వ‌చ్చాడు. ఈ మేరకు మొదటి పోస్ట్ చేస్తూ సాలిడ్‌గా అడుగు పెట్టేశారు.

Ali

ఆలీకి హీరోల‌తో స‌మానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయ‌న సాధార‌ణంగా త‌న అభిమానులని బ‌య‌ట క‌ల‌వ‌డ‌మే త‌ప్ప వేరే దారులు లేదు.అయితే ఇన్నాళ్లు న‌టుడిగా ఉన్న ఆలీ ఇప్పుడు నిర్మాత‌గాను కొత్త బిజినెస్ మొద‌లు పెట్టాడు. మ‌రి త‌న సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకోవాలంటే సామాజిక మాధ్య‌మాలు సెల‌బ్రిటీల‌కు త‌ప్ప‌నిస‌రి అయ్యాయి. ఈ క్ర‌మంలో ఇన్నాళ్లు ఫేస్ బుక్‌తో నెట్టుకొస్తున్న ఆలీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అలీ సొంత బ్యానర్‌లో రూపొందిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రంలోని ఓ సాంగ్‌ షూట్‌ సందర్భంగా తీసుకున్న ఫోటోనే ఇన్‌స్టా మొదటి పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు.ది నా అధికారిక ఖాతా.. ఈ స్టిల్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలోని నా గుండె చిక్కుకుంది అనే పాటలోంది అని చెప్పుకొచ్చారు. ఇక రానున్న రోజుల‌లో ఆలీ ఇన్‌స్టాలో వ‌రుస అప్‌డేట్స్‌తో సంద‌డి చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

మ‌రోవైపు బిగ్ బాస్ ఎంట్రీ కోస‌మే ఆలో ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చాడ‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఇండస్ట్రీలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఈయన.. 1000 సినిమాలకు పైగానే నటించాడు. ఈయన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారట నిర్వాహకులు. కచ్చితంగా అలీ వస్తే షో రేంజ్ కూడా పెరుగుతుందని.. ఆయన లాంటి ఓ లెజెండరీ కమెడియన్ ఇంట్లోకి వెళ్తే టిఆర్పీ కూడా భారీగానే పెరుగుతుందని ఈ క్ర‌మంలో స్టార్ మా యాజమాన్యం అలీకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకెళ్ల‌బోతున్నారంటూ ప్రచారం జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఆలీ ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చార‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఆలీ దీనిపై ఏమైన స్పందిస్తాడో లేదో.