Ali Reza: బిగ్ బాస్ ఫ్యామిలీ మ‌ధ్య అలీ రెజా శ్రీమంతి సీమంతం వేడుక‌

Ali Reza: అలీ రెజా.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సీరియల్ నటుడిగా పరిచయం అయిన అలీ రెజా.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా పాపులర్ అయ్యాడు. 17 మంది కంటెస్టెంట్స్‌తో సుమారు 106 రోజుల పాటు పాటు జరిగిన బిగ్ బాస్ సీజన్ 3లో అలీ రెజా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చాడు. ఏడోవారంలో అలీ రెజా ఎలిమినేట్ కాగా.. మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచాడు.

ఇక బిగ్ బాస్ తరువాత పెద్దగా మనోడి స్టార్ తిరగబడలేదు కానీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. తన మూవీ అప్డేట్స్‌తో పాటు.. పర్సనల్ విషయాలను షేర్ చేసుకునే అలీ రెజా.. తన అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తూ వీడియో ద్వారా ఇటీవ‌ల గుడ్ న్యూస్ చెప్పాడు. త్వ‌ర‌లో తాను తండ్రి కాబోతున్న విష‌యం స్ప‌ష్టం చేశాడు.

భార్యతో కలిసి ఓ వీడియో చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, ఇందులో అలీ భార్య బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చారు. ఇది చూసిన అతడి సన్నిహితులు, నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలీ భార్య మసుమ్‌ సీమంతం వేడుక నిర్వహించారు.

ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్‌ కపుల్‌గా అభివర్ణిస్తున్నారు.