BIGG BOSS: బిగ్ బాస్ కంటెస్టెంట్‌ని బాడీ కొల‌తలు అడిగిన నెటిజ‌న్..షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చిన అలీ రెజా

క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల‌న ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో సెలబ్రిటీఉ అంద‌రు ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. షూటింగ్స్‌తో నిత్యం బిజీగా ఉండే వారికి ఇప్పుడు ఎలాంటి ప‌ని లేక‌పోవ‌డంతో చాలా బోరింగ్‌గా ఫీల‌వుతున్నారు. త‌ర‌చు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో కొంద‌రు నెటిజన్స్ అడిగే ప్ర‌శ్న‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌రేమో ఫోన్ నెంబ‌ర్ అడిగితే, మ‌రొక‌రు న్యూడ్ ఫొటోస్ అడుగుతున్నారు. ఇంకొక‌రు బాడీ కొల‌త‌లు అడుగుతున్నారు. అయితే వీట‌న్నింటికి సెల‌బ్స్ త‌మ‌దైన శైలిలో స‌మాధానాలు ఇస్తూ నెటిజ‌న్స్ నోరెళ్ల‌పెట్టేలా చేస్తున్నారు.

బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ద్వారా ఫేమ‌స్ అయిన కంటెస్టెంట్స్ ఎక్కువగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం వంటి సోషల్ మీడియాలో సాధనాల్లో ఫేమస్ అయ్యారు. సినీ అవకాశాలు అంతగా రాకపోయినా కూడా వారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి వారిలో అలీ రెజా ఒకరు. బిగ్ బాస్ మూడో సీజన్‌లో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని అలీ రెజా షోలో ఒక‌సారి ఎలిమినేట్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. చివ‌ర‌కు టాప్ 5లో నిలిచాడు. రీసెంట్‌గా నాగార్జున న‌టించిన వైల్డ్ డాగ్ అనే చిత్రంలో క‌నిపించి అల‌రించాడు. సోలో హీరోగానూ ట్రై చేసేందుకు అడుగులు వేశారు.

అలీ రెజా ఇటీవ‌ల త‌న బ‌ర్త్ డే జ‌రుపుకోగా, రీసెంట్‌గా త‌న కొత్త సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. G.D అంటూ వదిలిన ఆ పోస్టర్ బాగానే క్లిక్ అయింది. ఇక రీసెంట్‌గా ఆయ‌న అభిమానుల‌తో ముచ్చ‌టించ‌గా, ఇందులో నెటిజన్స్ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా అడిగారు. ముద్దు పేరు ఏంటి అని అడ‌గ‌గా, అంద‌రు అలీ అంటారు, నా భార్య బాబు అని పిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఓ నెటిజన్ ఏకంగా బాడీ కొలతలు అడిగేశారు. దీనికి అవాక్కైన అలీరెజా మీరు నా కోసం బట్టలు కుట్టిస్తున్నారా ఏంటి? అని సెటైర్ వేసాడు. దీనికి షాక్ అయిన నెటిజ‌న్ మ‌ళ్లీ స్పందించ‌లేదు.