ALI పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాపులర్ కమెడీయన్ అలీ మధ్య ఉ్నన ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ నా సినిమాలో అలీ లేకపోతే ఏదో వెలితి ఉన్నట్టు అనిపిస్తుందని అన్నారంటే వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎలాంటిదో అందరికి అర్ధమయ్యే ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా ఇద్దరు మంచి స్నేహితులు కాగా, రాజకీయాలకు వచ్చే సరికి విరోధులు అయ్యారు. అలీ రాజకీయాలలోకి వెళుతున్నాడని వార్తలు వచ్చిన సమయంలో అందరు జనసేనలో చేరతారని అనుకున్నారు. కాని ఊహించని విధంగా వైసీపీ కండువా కప్పుకున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో భాగంగా అలీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
అలీకు జనసేన టిక్కెట్ ఇచ్చిన కూడా నన్ను వంచించి వైసీపీలోకి వెళ్లాడని పవన్ అన్నారు. కష్టాలలో ఉన్నప్పుడు తనతో అండగా ఉన్నాను. నాతో ఎప్పటికి కలిసి పని చేస్తానని అన్నాడు. ఇలాంటి వళ్ల మనుషులపై నమ్మకం పోతుంది అని పవన్ కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశాడు. దీనిపై అలీ కూడా స్పందించాడు. నేను స్వశక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయిలో ఉన్నానే తప్ప ఎవరో తీసుకువస్తే రాలేదు. ఖాళీగా ఉంటే పవన్ నాకు అవకాశాలు ఇచ్చార, లేక డబ్బులు ఇప్పించారా? పవన్ ఇండస్ట్రీకి రాకముందే నేను మంచి పొజీషన్లో ఉన్నాను. నేను వైసీపీలోకి వెళ్లకూడదని ఏ రాజ్యాంగం చెప్పలేదు కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు .
దాదాపు ఏడాదిన్నర వరకు ఇద్దరు ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ వేడుకలో పవన్, అలీ తారసపడ్డారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఫొటోలు కూడా దిగారు. వీరిద్దరిని ఇలా చూసి అభిమానులు చాలా సంతోషించారు. అయితే ఆ వేడుకలో పవన్, అలీ మధ్య ఏం మాట ముచ్చట జరిగిందని తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేశారు. తాజాగా అలీ ..లాయర్ విశ్వనాథ్ మవీ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌తో తనకు ఉన్న ఫ్రెండ్ షిప్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎలా ఉన్నావ్ అని అడిగారు పవన్. బాగున్నా అని చెప్పా.. మళ్ళీ కలుద్దాం అన్నారు. ఓకే అని నేను అన్నాను. మాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. మీడియానే లేని పోనివి సృష్టిస్తుంది. మధ్యలో ఆయనను కలవాలని ట్రై చేశా. అప్పుడు పవన్ పూణేలో ఉన్నట్టు తెలిసింది. 2021లో మేమిద్దరం కలిసి డెఫినేట్‌గా సినిమా చేస్తాం అని అలీ చెప్పుకొచ్చారు.