Cinematographer: గ‌న్ పేలి సినిమాటోగ్రాఫ‌ర్ మృతి..ఊహించ‌ని ప్ర‌మాదంతో ఉలిక్కి ప‌డ్డ చిత్ర యూనిట్

Cinematographer: వెండితెర‌పై మ‌నం ఏది చూసిన వినోద భ‌రితంగానే ఉంటుంది. కాని దాని వెనుక ఎంత క‌ష్టం ఉంటుంది. ఒక సినిమా వెనక వందలాది మంది కృషి ఉంటుంది. సినిమా సెట్స్‌లో అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. హీరోలు,హీరోయిన్స్, చిత్ర‌బృందం ఇలా ప్ర‌మాదాల‌కు గుర‌వుతుంటారు.

TheNewsQube-
Alec Baldwin Fired Prop Gun That Killed Cinematographer
Alec Baldwin Fired Prop Gun That Killed Cinematographer

కొద్దిరోజుల క్రితం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌తీయుడు చిత్ర షూటింగ్‌లోను ప్ర‌మాదం జ‌రిగి ఇద్ద‌రు మృతి చెందారు. తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో అనికొని ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన డమ్మీ గన్ పేలడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

హాలీవుడ్ మూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా గన్ పేలింది. దాంతో మహిళా సినిమాటోగ్రాఫర్ ప్రాణాలు కోల్పోయింది. హాలీవుడ్ లో ‘రస్ట్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్ విన్ చేతిలోని డమ్మీ తుపాకీ పేలింది. దాంతో అక్కడే ఉన్న మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు.

గన్ పేలడంతో ఇద్దరిని వెంటనే హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ.. హల్యానా హచిన్స్ మరణించారు. తీవ్రంగా గాయపడిన డైరెక్టర్ జోయల్ సౌజా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అమెరికాలోని న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్ లో జరిగింది.

ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగానే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాల్డ్ విన్ పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని తెలుస్తుంది. కాని ప్ర‌మాదం గురించి తెలిసిన వారంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.