బికినీలో బ‌ర్త్‌డే వేడుక‌… ఇదెక్క‌డి పైత్యంరా అంటూ నెటిజ‌న్స్ మండిపాటు

ఈ కాలం నాటి భామ‌లు అందాల ఆర‌బోత‌కు ఏ మాత్రం సంకోచించ‌డం లేదు. స‌మయం, సంద‌ర్భంతో సంబంధం లేకుండా గ్లామ‌ర్ షోతో చేస్తూ యూత్ గుండెల్లో బాణాలు దించుతున్నారు. రీసెంట్‌గా బబ్లీ గార్ల్స్ మాల్దీవుల‌కి వెళ్ళి అక్క‌డ చేసిన అందాల షో నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కించింది. ర‌కుల్ ప్రీత్ సింగ్, దిశా ప‌టానీ, సోనాక్షి సిన్హా, శాన్వి లాంటి భామ‌లు రెచ్చిపోయి అందాల క‌నువిందు చేస్తున్నారు. ఇక ‘జవానీ జానేమన్’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా నటించిన అలయా ఎఫ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా బికినీలో రెచ్చిపోయింది.

అల‌యా శ‌నివారం రోజు 23వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా ముంబైలోని అలీబాగ్ స‌ముంద్ర తీరంలో స్నేహితుల‌తో క‌లిసి స్టైలిష్‌గా బ‌ర్త్‌డే జ‌రుపుకుంది. తన పేరులోని A F అక్షరాలను పెద్దగా మంచి లైటింగ్‌తో ఏర్పాటు చేయ‌గా, అక్క‌డ బికినీలో నిలుచుకొని ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్స్ ఇదెక్క‌డి పైత్యం అంటూ మండిప‌డుతున్నారు. పుట్టిన రోజు ప‌ద్ద‌తిగా ఉండాలి కాని, ఈ బికీనీల‌లో ర‌చ్చ ఏందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అల‌యా ప్రముఖ నటి పూజా బేడి కూతురు కాగా, ఈ ఏడాది జనవరిలో వచ్చిన ‘జవాని జానేమన్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది అలయా. ఇందులో 21 ఏళ్ల గర్భవతిగా అలయా కనిపించింది. అలయాకు తండ్రిగా సైఫ్ అలీ ఖాన్, తల్లిగా టబు నటించారు. ఓ సారి నెపోటిజం విమ‌ర్శ‌లు అల‌యా ఎదుర్కోగా దానిపై క్లారిటీ ఇచ్చింది. 10 సార్లు ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయితే.. బయట వాళ్లు 100 సార్లు రిజెక్ట్ కావచ్చని అంది. ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే అంటే తనకు ఇష్టమని..వారిలానే తాను కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాల‌ని అనుకుంటుంది అల‌యా.

Advertisement