Al Pacino : 83 ఏండ్ల వయసులో తండ్రి అయిన స్టార్ యాక్టర్.. 29 ఏళ్ల అమ్మాయితో..!
NQ Staff - June 1, 2023 / 09:32 AM IST

Al Pacino : రాను రాను సమాజం దారుణంగా తయారవుతోంది. బంధాలకు ఏజ్ గ్యాప్ అనేది లేకుండా పోతోంది. 25 ఏళ్ల అమ్మాయి కూడా 70 ఏళ్ల ముసలాడితో ప్రేమలో పడి పెండ్లి చేసుకుంటున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే ఇలాంటివి కామన్ అయిపోతున్నాయి. ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది.
ఓ హాలీవుడ్ నటుడు ఏకంగా 89 ఏండ్ల వయసులో తండ్రి అయ్యాడు. అది కూడా 29 ఏళ్ల తన గర్ల్ ఫ్రెండ్ తో బిడ్డను కన్నాడు. ఈ విషయం ఇప్పుడు హాలీవుడ్ లో మార్మోగి పోతోంది. ఇది విన్న నెటిజన్లు ఈ వయసులో తండ్రి ఎలా అయ్యావయ్యా అంటూ ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ సీనియర్ నటుడు అల్ పసినో కొంతకాలంగా నిర్మాత నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నారు.
ఆమె వయసు కేవలం 29 ఏండ్లు మాత్రమే. ఇన్నాళ్లు వీరిద్దరూ తమ డేటింగ్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. కీన త్వరలోనే అల్పల్లా పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సన్నిహితులు తెలిపారు. ఈ విషయం మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అల్ పసినోకు ఇది నాలుగో సంతానం.
ఆయనకు గతంలో జాన్ టర్రాంట్ తో డేటింగ్ చేసినప్పుడు ఓ కూతురు పుట్టింది. ఆమె వయసు ఇప్పుడు 33 ఏండ్లు. దాంతో పాటు మాజీ గర్ల్ ఫ్రెండ్ బేవర్లీ డీ ఆంజెల్లోతో ఇద్దరు కవల పిల్లలను కూడా కన్నాడు మనోడు. ఇంత మంది ఉన్న తర్వాత కూడా మూడో గర్ల్ ఫ్రెండ్ తో పెండ్లికి ముందే బిడ్డను కంటున్నాడు.
కానీ వయసులో కనడం ఏంట్రా బాబు అంటూ కొందరు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ వయసులో ఒకరు పట్టుకుంటే తప్ప లేవలేనోడు బిడ్డను ఎలా కంటాడు అంటున్నారు. యంగ్ కుర్రాళ్లకే పిల్లలు పుట్టక నానా అవస్థలు పడుతుంటే.. నువ్వెలా కంటున్నావ్ రా అంటున్నారు.