Al Pacino Gave Birth Baby Boy With Noor Alfallah : 83 ఏళ్ల వయసులో తండ్రి అయిన స్టార్ హీరో.. ఆడు మగాడ్రా బుజ్జి..!

NQ Staff - August 5, 2023 / 09:20 AM IST

Al Pacino Gave Birth Baby Boy With Noor Alfallah : 83 ఏళ్ల వయసులో తండ్రి అయిన స్టార్ హీరో.. ఆడు మగాడ్రా బుజ్జి..!

Al Pacino Gave Birth Baby Boy With Noor Alfallah :

కొన్ని విచిత్రాలు వినడానికి కూడా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఎందుకంటే అసలు జరుగుతాయా అంటే సమాధానమే ఉండదు. కానీ అద్భుతాలు ఇలాగే జరుగుతాయేమో. ఈ జనరేషన్ లో 25 ఏళ్ల వారు కూడా పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతుంటే ఓ స్టార్ హీరో మాత్రం ఏకంగా 83 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు.

ఇప్పుడు ఈ విషయమే అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఆయన ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ హీరో అల్ పాసినో. ఈయన గాడ్ ఫాదర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఆయన కొంత కాలంగా 29 ఏళ్ల వయసున్న నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నాడు.

గతంలో ఇద్దరితో డేటింగ్..

ఈ క్రమంలోనే గత జూన్ నెలలో నూర్ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. రోమన్ పాసినో అని నామకరణం చేశారు. అంత పెద్ద వయసున్న ముసలాడితో ఆమె ఎలా డేటింగ్ చేస్తోందనేది అందరికీ ఆశ్చర్యమే. కానీ విధి అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. కాగా నూర్ కంటే ముందు ఇద్దరితో డేటింగ్ చేశాడు అల్ పాసినో.

మొదట యాక్టింగ్ కోచ్ అయిన టారెంట్ అనే మహిళతో డేటింగ్ చేశాడు. వీరి డేటింగ్ కారణంగా ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆ తర్వాత ప్రముఖ నటి బేవర్లీ డి ఎంజ్‌లో తో కూడా డేటింగ్ చేశాడు. వీరికి కవలలు జన్మించారు. ఈ తర్వాత నూర్ అల్ఫాల్లా తో డేటింగ్ చేసి మరో మగబిడ్డకు తండ్రి అయ్యాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us