దుర్గామతి నిర్మాతగా అక్షయ్ కుమార్ .. అప్పుడే నష్టపోతాడేమో అన్న కామెంట్స్ ..?

బాలీవుడ్ లో గత మూడు నాలుగేళ్ళుగా అక్షయ్ కుమార్ వరస హిట్స్ తో టాప్ ప్లేస్ లో కూర్చున్నాడు. ఖాన్ ల త్రయం తో పాటు మిగతా బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా దక్కించుకోని బ్లాక్ బస్టర్స్ ని అక్షయ్ కుమార్ దక్కించుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో తన సినిమాలు నిర్మించమని నిర్మాతలకి సలహాలిస్తూ భారీ గా లాభాలు తెచ్చి పెడుతున్నాడు. ఎంత కాదన్న అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్ళని సాధించి నిర్మాతలకి ఊహించని విధంగా లాభాలు తెచ్చిపెడుతున్నాడు.

Laxmi Bomb' first look: Akshay Kumar dazes with his saree! - RozBuzz

ఈ క్రమంలోనే జాలీ ఎల్.ఎల్.బి 2, టాయిలెట్ ఏక్ ప్రేం కథ, ప్యాడ్ మాన్, కేసరి, మిషన్ మంగళ్, హౌజ్ ఫుల్ 4 సినిమాలతో భారీ సక్సస్ లను అందుకున్నాడు. ఇదే ఊపుతో రీసెంట్ గా సౌత్ లో సూపర్ హిట్ గా నిలిచిన కాంచన సినిమాను హిందీలో ‘లక్ష్మి’ గా రీమేక్ చేశాడు. థియేటర్స్ తెరవకపోవడం తో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే గత నాలుగేళ్ళ సక్సస్ ట్రాక్ ని లక్ష్మీ దెబ్బ కొట్టింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అక్షయ్ కుమార్ తో పాటు అభిమానులని బాగా డిసప్పాయింట్ చేసింది.

కాగా లక్ష్మి తర్వాత మరో సౌత్ సినిమా భాగమతి హిందీలో అక్షయ్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అక్షయ్ నిర్మాత… కాగా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ తెలుగులో అనుష్క నటించిన పాత్ర పోషించింది. ఈ సినిమాకి దుర్గామతి గా పేరు పెట్టారు. ఈ సినిమాని నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అక్షయ్ నటించిన లక్ష్మీ ఓటీటీ లో రిలీజై దెబ్బ కొట్టిందన్న నెగిటివ్ టాక్ నడుస్తున్న ఈ సమయంలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నందుకు కొంతమంది అక్షయ్ కుమార్ తీసుకున్న ఈ డెసిషన్ కరెక్ట్ కాదేమో అంటున్నారట. అందుకు కారణం రీసెంట్ గా రిలీజైన దుర్గామతి ట్రైలర్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో ఈ సినిమాతో నిర్మాతగా అక్షయ్ కుమార్ నష్టపోతాడేమో అని మాట్లాడుకుంటున్నారట. చూడాలి మరి ఈ సినిమా అక్షయ్ కి ఎలాంటి రిజల్ట్ ని తీసుకు వస్తుందో.

Advertisement