Akkineni Nagarjuna : సమంతకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాగార్జున.. ఆమె మీద కోపంతో ఆ పని..!

NQ Staff - March 23, 2023 / 04:08 PM IST

Akkineni Nagarjuna : సమంతకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాగార్జున.. ఆమె మీద కోపంతో ఆ పని..!

Akkineni Nagarjuna : అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఈ నడుమ బాగా పాపులర్ అవుతోంది. అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోయినప్పటి నుంచే వారికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కినేని హీరోలు ఏం చేసినా, ఏం మాట్లాడినా సరే దాన్ని సమంతకు ఆపాదిస్తున్నారు కొందరు నెటిజన్లు.

అలాగే సమంత ఏం చేసినా సరే దాన్ని అక్కినేని హీరోలకు ఆపాదిస్తున్నారు. తాజాగా నాగార్జున చేసిన పనితో సమంతకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ప్రస్తుతం సమంత విడాకులు తీసుకున్న తర్వాత తన సినిమాలతో తాను చాలా బిజీగా ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి.

మజా యాడ్ లో..

గతంలో సమంత మజా యాడ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ ద్వారా అప్పట్లో ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన యాడ్ లో నాగార్జున, పూజాహెగ్డే కలిసి నటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన యాడ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది చూసిన కొందరు.. సమంతకు నాగార్జున ఇలా షాక్ ఇచ్చాడుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా నాగార్జునకు సమంత మీద అంతో ఇంతో కోపం ఉందని ఈ సందర్భంగా చెబుతున్నారు. కానీ సమంత మాత్రం దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. ఎందుకంటే ఆమెకు చాలా యాడ్స్ ఉన్నాయి.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us