Akkineni Naga Chaitanya : నాగార్జునతో గొడవలు.. కొత్త ఇంటిని కట్టుకున్న నాగచైతన్య..!
NQ Staff - March 17, 2023 / 03:20 PM IST

Akkineni Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఏ పని చేసినా ఈ నడుమ చాలా వైరల్ అవుతోంది. ఎందుకంటే సమంత-చైతూ విడిపోయినప్పటి నుంచే ఆ ఇంట్లో వారు ఎక్కడ ఏం మాట్లాడుతారు అని అంతా వెయిట్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
నాగ చైతన్య తాజాగా ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆయన ఎప్పటి నుంచో ఓ ఇంటిని నిర్మించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే తన టేస్ట్ కు తగ్గట్టు ఓ ఇంటి స్థలాన్ని కొనుక్కున్న చైతూ.. అందులో తనకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకున్నాడు.
సింగిల్ గా ఉండాలని..
తన కొత్త ఇంట్లోకి సైలెంట్ గానే చైతూ వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే నాగచైతన్య తన కొత్త ఇంటిని నిర్మించుకోవడం వెనక పెద్ద కారణం ఉన్నట్టు తెలుస్తోంది. సమంతతో విడిపోయినప్పటి నుంచి నాగార్జునతో ఆయనకు కొంచెం గొడవలు వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సింగిల్ గా ఉండాలని చైతూ భావించాడంట.
సినిమాల పరంగా చైతూకు నాగార్జున నుంచి ఎలాంటి సాయం అందట్లేదనే అంసతృప్తి ఉంది. అందుకే తన సొంత నిర్ణయాలతోనే ఇంటికి దూరంగా ఉంటున్నాడు చైతూ. దాంతో చైతూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆయన అందరికీ దూరం అయి ఒంటరి అయిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.