Akkineni Fans: బాలకృష్ణను ఇండస్ట్రీ నుండి బహిష్కరించాల్సిందేనట!
NQ Staff - January 25, 2023 / 05:03 PM IST

Akkineni Fans : వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. ఒక వైపు ఎస్వీ రంగారావు యొక్క సామాజిక వర్గం వారు మరో వైపు అక్కినేని నాగేశ్వరరావు యొక్క కుటుంబ సభ్యులు మరియు అభిమానులు బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమీపంలో ఆందోళన నిర్వహించారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కూడా అక్కినేని ఫ్యాన్స్ బాలకృష్ణ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. లేదంటే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నుండి బాలకృష్ణను బహిష్కరించాలని, సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ఆయన బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇండస్ట్రీ పెద్దలు అంటే గౌరవం లేని బాలయ్య కు ఇండస్ట్రీ లో కొనసాగే అర్హత లేదని వారు విమర్శించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసిన కాదని ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయినా కూడా కొందరు కావాలని దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు అక్కినేని ఫ్యాన్స్ పై తీవ్ర అగ్రహంతో కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి అక్కినేని వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో పీక్స్ కు చేరింది.